
పొలాలకు నీరు విడుదల
వడ్డాదిలో గేటు ఎత్తి నీరు విడుదల చేస్తున్న రైతు సంఘ నాయకులు
బుచ్చెయ్యపేట: పెద్దేరు రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిని కస్పా పొలాలకు శుక్రవారం విడుదల చేశారు. స్థానిక రైతు సంఘం నాయకులు దాడి పెద గోవింద,దాడి చిన గోవింద తదితర్లు వడ్డాదిలో కస్పా కాలువపై ఉన్న గేట్లు ఎత్తి సాగునీరు విడుదల చేశారు. వడ్డాది,చిన అప్పనపాలెం,పోలేపల్లి,గౌరీపట్నం,దిబ్బిడి, బుచ్చెయ్యపేట తదితర గ్రామాలకు చెందిన రైతులకు ఈ కాలువ కింద భూములన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడంతో రైతులు వరి ఆకుమడులు వేసేందుకు నీరు విడుదల చేశారు.