
పీజీ సెట్‌లో ర్యాంకుల పంట
నర్సీపట్నం: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే ఏపీ పీజీ సెట్ ఫలితాల్లో నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో మంచి ర్యాంకులు సాధించారు. ఎం.కామరాజు హిస్టరీలో 24వ ర్యాంకు, జె.వరలక్ష్మి కామర్స్‌లో 101వ ర్యాంకు, కె.చాందిని బోటనీలో 127, ఎల్.అశ్విని బోటనీలో 214, సిహెచ్.మౌనిక పొలిటికల్ సైన్స్‌లో 256, కె.నందిని బోటనీ 307, సిహెచ్.దుర్గాప్రసాద్ కామర్స్ 347, కె.సంజన బోటనీ 379, ఎన్.రోహిణి బోటనీ 587, జి.రమ్య రాజేశ్వరి దేవి కెమికల్ సైన్స్‌లో 610 ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. డాక్టర్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా ఉత్తమ ర్యాంకులు సాధించారు. గణితంలో ఎన్.వినయ్ కుమార్ 18వ ర్యాంకు, వృక్షశాస్త్రంలో ఎ.లక్ష్మీశ్రావణి 97, గాయత్రి 127, వి.శ్యామల 184 ర్యాంకులు సాధించారు. రసాయన శాస్త్రంలో కె.మధు కిరణ్ 144వ ర్యాంకు సాధించారు.
పీజీ సెట్‌లో జ్యోత్స్నకు 4వ ర్యాంకు
యలమంచిలి రూరల్: ఏపీ పీజీ సెట్‌లో యలమంచిలికి చెందిన రావాడ జ్యోత్స్న సత్తా చాటింది. ఆమె కెమికల్ సైన్సెస్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. స్థానిక గీతాంజలి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన జ్యోత్స్న ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది. తమ కుమార్తెకు ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు నాగేశ్వరరావు, కరుణకుమారి ఆనందం వ్యక్తం చేశారు. పీజీ పూర్తి చేసి మంచి ఉన్నత ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని జ్యోత్స్న సాక్షికి తెలిపింది.

పీజీ సెట్‌లో ర్యాంకుల పంట

పీజీ సెట్‌లో ర్యాంకుల పంట

పీజీ సెట్‌లో ర్యాంకుల పంట

పీజీ సెట్‌లో ర్యాంకుల పంట