
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
పాయకరావుపేట: యువకులు, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటిని అలవాటు చేసుకుంటే బానిసై భవిష్యత్ నాశనమవుతుందని జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్ (మాదక ద్రవ్యాలు రహిత భారతం)లో భాగంగా పట్టణంలో వాక్‌థాన్ నిర్వహించారు. స్థానిక కల్యాణ మండపం నుంచి గౌతమ్ థియేటర్ వరకు విద్యార్థులు, అధికారులు, నాయకులు ర్యాలీగా వెళ్లారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. తొలుత కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఏఎస్పీ మాట్లాడారు. గంజాయి, హెరాయిన్, వంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల భవిష్యత్ నాశనమవుతుందన్నారు. కార్యక్రమంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీవిద్య, పాయకరావుపేట సీఐ జి.అప్పన్న, కూటమి నాయకులు తోట నగేష్, గెడ్డం బుజ్జి, పెదిరెడ్డి చిట్టిబాబు, యాళ్ల వరహాలు, చించలపు పద్దూ, కొప్పిశెట్టి వెంకటేష్, రెవెన్యూ శాఖ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
● వాకథాన్‌లో ఏఎస్పీ మోహన్‌రావు