
జగన్నాథ రథయాత్రకు గట్టి బందోబస్తు
అనకాపల్లి : ప్రశాంతమైన వాతావరణంలో జగన్నాథస్వామి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందకు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ శ్రావణి అన్నారు. స్థానిక గవరపాలెం అగ్రిమర్రిచెట్టు వద్ద కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి దేవస్థానంలో తొలి రథయాత్ర ఏర్పాట్లను గురువారం ఆమె పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ పరిశీలించి, కమిటీ సభ్యులతో మాట్లాడారు.
శుక్రవారం ఉదయం జగన్నాథస్వామి రథోత్సవం గవరపాలెం నుంచి రైల్వే స్టేషన్‌గూడ్స్ రోడ్డు ఇంద్రజ్యుమ్నహాలు వరకూ జరుగుతుందని, స్వామివారు అక్కడ నవరాత్రులు భక్తులకు వివిధ రూపాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని డీఎస్పీ చెప్పారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ కార్య నిర్వహణ అధికారి బి మురళీ, కమిటీ సభ్యులు బుద్ధ ఆదిలక్ష్మి, యల్లబిల్లి ధనలక్ష్మి, కాండ్రేగుల మహాలక్ష్మి, పేకేటి తులసి, భుగాతా కోటేశ్వరరావు, యండపల్లి చంద్రశేఖర్, మంగళపల్లి వి.వి. సుబ్రహ్మణ్యం, బొడ్డేడ వెంకట చలపతిరావు పాల్గొన్నారు.
డీఎస్పీ శ్రావణి
గవరపాలెంలోని ఆలయం వద్ద ఏర్పాట్ల పరిశీలన