
సింగపూర్ ప్రయాణికులకు శుభవార్త
విశాఖ సిటీ: విశాఖ నుంచి సింగపూర్ విమాన ప్రయాణికులకు శుభవార్త. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో స్కూట్ విమానయాన సంస్థ సింగపూర్ ఫ్లైట్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దీంతో సీట్ల సామర్థ్యం పెరిగింది. ఇప్పటి వరకు 180 సీట్లతో ఏ320సీఈఓ విమాన సర్వీసు అందుబాటులో ఉంది. దీని స్థానంలో బుధవారం నుంచి ఏ321ఎన్‌ఈఓ విమానాన్ని విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు నడుపుతోంది. ఇందులో 236 సీట్లు ఉన్నాయి. ఫలితంగా విశాఖ–సింగపూర్ విమాన సర్వీస్‌లో మరో 56 మంది అధికంగా ప్రయాణించే వెసులుబాటు కలుగుతోంది.