
బదిలీ ఉపాధ్యాయుల జీతాల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల జీతాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. జిల్లా ఖజానా అధికారి వి.ఎల్.సుభాషిణికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్లతో కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారని, పాత స్థానంలో పనిచేసిన కాలానికి నాన్–డ్రాయల్ తీసుకుని, కొత్త ప్లేస్‌లోనే జీతం బిల్లులు తయారు చేసుకునేందుకు ఎస్‌టీవోలకు తగిన సూచనలు చేయాలని ఆయన కోరారు. డీఈవో/సీఎస్‌ఈ శాంక్షన్ చేసిన క్యాడర్ స్ట్రెంత్ వివరాలను జిల్లాలోని ఎస్‌టీవోలకు సర్క్యులేట్ చేయాలని ఆయన కోరారు.