
ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాకంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
నర్సీపట్నం: పట్టణంలో రామారావుపేట పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని సామాజిక కార్యకర్త కె.శివనారాయణరాజు కలెక్టర్ విజయ కృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన విద్యార్థులను కాలేజీలు, పాఠశాలల వద్ద దించి, రోడ్లపైనే బస్సులు, ఆటోలు, వ్యాన్‌లు నిలిపివేయటం వల్ల ప్రజలు రాకపోకలు సాగించేందుకు నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. విద్యాసంస్థల నిర్వాకం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లేదని శివనారాయణరాజు కలెక్టర్‌కు నివేదించారు.