
శివ.. శివా..
అచ్యుతాపురం రూరల్: రాంబిల్లి మండలం పంచదార్ల పంచాయతీలోని ఓ మారుమూల గ్రామమైన ధారపాలెం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రముఖమైనది. చారిత్రక ప్రాధాన్యమున్న పంచదార్ల శివాలయంలో రాతి కట్టడాలను పరిరక్షించేందుకు ఈ క్షేత్రాన్ని పురావస్తు శాఖకు అప్పగించారు. అయితే నాటి శిల్ప సంపదను గానీ, ఆలయ పవిత్రతను గానీ కాపాడే చర్యలేవీ కానరాక ఈ ఆలయం రోజురోజుకూ కునారిల్లిపోతోంది. అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. సరైన మౌలిక సదుపాయాలు లేక భక్తుల అవస్థలు వర్ణనాతీతం. పంచదార్లలో పుణ్య స్నానం ఆచరించాక మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కూడా సరైన గదుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో పుణ్యక్షేత్రం పరిసరాలు మల విసర్జనలతో అపవిత్రమవుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల సమీపంలో మద్యం సీసాలు కనిపిస్తున్నాయి.