
ఎవరికీ పట్టని ఆలయ రక్షణ
దేవాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నప్పటికీ, ఆలయ కట్టడాలు మాత్రం దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. ఆలయ శిల్ప కళానైపుణ్యం కనుమరుగవుతున్నా పట్టించుకునేవారు లేరు. ఆలయ స్తంభాలపై చెక్కిన శిలా శాసనాలపై తెలుపు సున్నం వేయడంతో అవన్నీ కనుమరుగు అయిపోతున్నాయి. ప్రాచీన ఆలయాల అభివృద్ధి పేరుతో శిథిలావస్థకు చేర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అభివృద్ధి పేరిట తలపెట్టిన కార్యాచరణ అర్థంతరంగా ఆగిపోవడంతో గ్రావెల్ మట్టి ధార నీటిలో పడి ధార నీరు కలుషితమవుతోంది. ఈ పరిస్థితి భక్తులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది.
పురావస్తు శాఖ అనుమతితోనే తవ్వకాలు
ధార ప్రదేశంలో ప్రహరీ గోడ కూలిపోకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు చేపట్టామని ఆలయ కార్యనిర్వహణాధికారి తేజ తెలిపారు. పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరణ ఇచ్చారు. తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.
శిలా శాసనాలపై తెలుపు సున్నం.. శిథిలమైన ప్రాచీన శిల్ప కళ

ఎవరికీ పట్టని ఆలయ రక్షణ