
కళాకారులు చైతన్య దీపికలు
అనకాపల్లి: ప్రజానాట్య మండలి జిల్లా గౌరవాధ్యక్షునిగా రాజాన దొరబాబు, అధ్యక్షునిగా మర్రి రాజునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మెయిన్‌రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో కార్యదర్శిగా గొర్లె దేముడుబాబు, సహాయ కార్యదర్శులుగా కె.వి.రమణ, కొండబాబు, పొంతపల్లి రామారావు, వియ్యపు రాజు, బాబ్జీ, విత్తనాల పోతురాజు ఎన్నికయ్యారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై కమిటీ కాల పరిమితి రెండు సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. జిల్లాలో అద్భుతమైన కళాకారులు ఉన్నారని, సమాజహితం కోసం ప్రజానాట్య మండలి కృషి చేస్తుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ కళాకారులు కళారూపాల ద్వారా ప్రభుత్వ విధానాలపై ప్రజలను జాగృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు జి.గురుబాబు, వైఎన్ భద్రం, కోరుపల్లి శంకరరావు, ఫణీంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.