
అర్జీలకు పరిష్కారమేదీ?
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ సామాన్యులకు అక్కరకు రావడం లేదు. పీజీఆర్‌ఎస్‌లో జిల్లా అధికారులను కలిసి కష్టాలు చెప్పుకోవచ్చన్న వారి ఆశలపై నీళ్లు చల్లుతూ సిబ్బంది నిర్దయగా వ్యవహరిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామానికి చెందిన కొర్ని అప్పలనర్శ ఉదంతమే అందుకు ఉదాహరణ. కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూమిని తన సోదరులు వారి పేరున ఆన్‌లైన్ చేసుకొని తనకు అన్యాయం చేశారని ఆమె కలెక్టరేట్‌లో మూడు వారాల క్రితం ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయమని అడుగుదామంటే సిబ్బంది అడ్డుకుని బయటకు తరిమేస్తున్నారనిఆమె వాపోయింది.
8లో