
డీఈవోకు ఎంటీఎస్ ఉపాధ్యాయుల వినతి
అనకాపల్లి టౌన్: ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల్లో న్యాయం చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పంపాల వెంకటరమణ కోరారు. స్థానిక డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998, 2008 బ్యాచ్‌లకు చెందిన ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల్లో మైదాన ప్రాంతాలలో ఖాళీలను చూపించాలని, వారి వయసు రీత్యా ఏజెన్సీలో పనిచేయడం కష్టతరమన్నారు. ఎస్‌ఎస్‌సీ మూల్యాంకన రుసుంను వెంటనే విడుదల చేయాలన్నారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నక్కా శ్రీనుబాబు, ఉపాధ్యక్షుడు ఎం.వి.లోకేష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.