
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ తులసీ దళార్చనను ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం 108 స్వర్ణ తులసీదళాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.
వైభవంగా నిత్యకల్యాణం
శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచారు. ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి 0అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.