
ఆదర్శ రైతు మృతి
కోటవురట్ల: మండలంలో కై లాస పట్నం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు, గ్రామ పెద్ద సిద్ధాబత్తుల చంటి అప్పారావు శనివారం మృతి చెందారు. చిన అప్పారావు పెద్ద కోడలు ఉమాదేవి జెడ్పీటీసీ కాగా, పెద్ద కుమారుడు సత్తిబాబు, చిన్న కుమారుడు నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంటి అప్పారావు మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ నడిచే సమయంలో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతుగా చంటి అప్పారావు పలు అవార్డులను అందుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు డి.వి. సూర్యనారాయణ రాజు, వైఎస్సార్ సీపీ జిల్లా వ్యవసాయ సలహా మండలి మండలి మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. సత్యనారాయణ రాజు తదితరులు చిన అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.

ఆదర్శ రైతు మృతి