అంగన్‌వాడీ భవనంపై కూలిన భారీ చింత చెట్టు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ భవనంపై కూలిన భారీ చింత చెట్టు

May 31 2025 1:33 AM | Updated on May 31 2025 1:33 AM

అంగన్‌వాడీ భవనంపై కూలిన భారీ చింత చెట్టు

అంగన్‌వాడీ భవనంపై కూలిన భారీ చింత చెట్టు

● పాక్షికంగా దెబ్బతిన్న కారు

దేవరాపల్లి: మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రైవాడ పంచాయతీ శివారు శంభువానిపాలెంలో భారీ చింత చెట్టు.. పక్కనే ఉన్న అంగన్‌వాడీ భవనంపై కూలింది. ఆ సమయంలో అంగన్‌వాడీ కేంద్రం మూసి ఉండడం, పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే చింత చెట్టు కింద పార్క్‌ చేసిన గ్రామానికి చెందిన నాయుడు కారు పాక్షికంగా దెబ్బతింది. గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత పంట పొలాల్లో వర్షపు నీరు భారీగా చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement