త్వరలో పింఛను నగదు పంపిణీ చేస్తాం
● ఎంపీడీవో ప్రసాదరావు
కొయ్యూరు: పింఛన్లు పొందని వారందరికి త్వరలో నగదును పంపిణీ చేస్తామని ఎంపీడీవో ప్రసాదరావు హామీ ఇచ్చారు.బుధవారం ఆయన చింతలపూడి పంచాయతీ లుబర్తి, లొద్దిపాకలలో పర్యటించారు. ఇక్కడ పించన్లు పంపిణీ చేయాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ చైతన్య రూ.2.88 లక్షలతో పరారయ్యాడు. దీనిపై ఎంపీడీవో సామాజిక భద్రత పింఛన్లు తీసుకోలేని వారితో మాట్లాడారు. వెటర్నరీ అసిస్టెంట్ నగదుతో పరారీ కావడంతో సకాలంలో పింఛన్లు చెల్లించలేక పోయామని ఆయన వివరించారు.కొద్ది రోజుల్లో అందరికి చెల్లిస్తామన్నారు. పరారైన చైతన్య ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదన్నారు.దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని విలేకరులకు తెలిపారు.


