గర్భిణులకు అల్ట్రా సౌండ్‌పరీక్షలు
ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్‌సీలో గర్భిణులకు అల్ట్రాసౌండ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ పరీక్షలు అందుబాటులో లేక గర్భిణులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల ఒకటిని సాక్షిలో ‘ముంచంగిపుట్టులో నిలిచిన అల్ట్రా సౌండ్ పరీక్షలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. జిల్లా ఆస్పత్రి నుంచి బుధవారం గైనకాలజిస్ట్‌ను పంపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 48 మంది గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేశారు. పాడేరు వెళ్లి స్కానింగ్ చేసుకునే ఇబ్బందులు తొలగడంతో గర్భిణులు సంతోషం వ్యక్తం చేశారు.
గర్భిణులకు అల్ట్రా సౌండ్‌పరీక్షలు


