విరామం
జలవిద్యుత్ ఉత్పత్తికి
మోతుగూడెం: పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఐదు, ఆరు యూనిట్లు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రారంభించే లక్ష్యంతో ఏపీ జెన్‌కో అధికారులు ఉన్నారు. దీనిలో భాగంగా ఐదు, ఆరు యూనిట్ల అను సంధాన పనుల నిమిత్తం ఈ కేంద్రంతోపాటు ఎగువున ఉన్న డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో కూడా ఉత్పత్తి నిలిపివేసి పనులు చేపట్టారు. ఇందునిమిత్తం సుమారు రెండు నెలలపాటు జలవిద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఉంటుందని ఏపీ జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి.
● పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒకొక్క యూనిట్ నుంచి 115 మెగావాట్ల చొప్పున 460 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. అదనంగా 115 మెగావాట్ల సామర్థ్యంతో 5,6 యూనిట్లను రూ.506 కోట్లతో ఏపీ జెన్ కో మూడేళ్ల క్రితం చేపట్టింది. ఇప్పటివరకు పెన్‌స్టాక్ పైపులైన్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. పవర్ హౌస్‌లో ఐదవ యూనిట్‌కు సంబంధించి 60 శాతం, ఆరో యూనిట్‌కు సంబంధించి 40 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయి.
● నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్న 5,6 యూనిట్లకు సంబంధించి పెన్‌స్టాక్ వరకు అనుసంధానం పనులు ప్రారంభించారు. దీనికి సంబంధించి సివిల్, మెకానికల్ పనులు చేపట్టారు. ఫోర్‌బే అండర్ గ్రౌండ్ టన్నెల్ వద్ద గేటు ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని వాల్వ్ హౌస్ సర్జ్ ట్యాంక్‌లో బల్క్ గేట్లు ఏర్పాటు చేసే పనుల్లో ఇంజినీరింగ్ అధికారులు నిమగ్నమయ్యారు.
● పెన్‌స్టాక్‌లో ఉన్న నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతోపాటు పవర్ హౌస్ దిగువున ఉన్న ట్రయల్ రేస్‌లో నీటిని ఖాళీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత 5,6 యూనిట్లకు నిర్మించిన కాంక్రీట్ గోడలను తొలగించి కొత్తగా గేట్లను ఏర్పాటుచేస్తామని జెన్‌కో అధికారులు తెలిపారు. కొత్తగా గేట్లతో పాటు పాత గేట్లకు నిష్ణాతులైన డైవింగ్ టీం తో నీటి అడుగున మరమ్మతులు చేపడతామని వారు తెలిపారు.
● డొంకరాయి నుంచి ఫోర్‌బే రిజర్వాయర్ వరకూ ఉన్న తొమ్మిది కిలోమీటర్ల పొడవునా పవర్ కెనాల్‌కు సుమారు రూ.2కోట్లతో కాంక్రీట్‌తో మరమ్మతులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ కేంద్రానికి మేజర్ ఓవరాలింగ్ చేసేందుకు అభిరామ్ కంపెనీకి పనులు అప్పగించారు.
● పొల్లూరు జలవిద్యుత్తు కేంద్రానికి సంబంధించి ఒకటి, మూడు యూనిట్లలో ఎస్‌వోఆర్, బట్టర్‌ఫ్లై వాల్వుకు రెగ్యులర్ పనులు చేయనున్నారు. ఈ రెండు నెలల కాలంలో డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్తు కేంద్రాల ద్వారా సుమారు 120 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి కోల్పోతుందని అధికారవర్గాలు తెలిపారు.
గోదావరి డెల్టాకు శుభవార్త
ఉభయ గోదావరి జిల్లాల్లో రబీసీజన్‌కు సంబంధించి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున ఐదారు రోజుల్లో విడుదల చేయనున్నారు. డొంకరాయి జలాశయ నీటిని రెండు మూడు రోజుల్లో విడుదల చేసేలా జెన్‌కో అధికారులతో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సంప్రదింపులు చేశారు.
పనుల వేగవంతానికి చర్యలు
నూతనంగా నిర్వహిస్తున్న 5,6 యూనిట్లు అనుసంధాన ప్రక్రియ రెండు నెలలు సాగుతుంది. ఈ కాలంలో 120 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోతుంది. వచ్చే ఏడాదికి 5,6 యూనిట్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తికి పనులు వేగవంతం చేశాం.
– రాజారావు, చీఫ్ ఇంజినీర్ మోతుగూడెం
శరవేగంగా నిర్మాణం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 5,6 యూనిట్ల నిర్మా ణ పనులు శరవేగంగా సా గుతున్నాయి. స్ధానిక అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం.
– బాలకృష్ణ,
ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్, మోతుగూడెం
ఐదారు యూనిట్ల అనుసంధాన
పనులు వేగవంతం
పొల్లూరు, డొంకరాయిలో
రెండు నెలలు నిలిపివేత
120 మిలియన్ యూనిట్ల
ఉత్పాదనపై ప్రభావం
వచ్చే ఏడాది మార్చి నాటికి
రెండు యూనిట్లు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు
దృష్టి సారించిన ఏపీ జెన్‌కో అధికారులు
రెండు మూడు రోజుల్లో గోదావరి డెల్టాకు డొంకరాయి నుంచి
నీటి విడుదలకు కసరత్తు
విరామం
విరామం
విరామం
విరామం
విరామం


