
ఇలాగైతే రాకపోకలు ఎలా?
● ప్రధాన రహదారి మధ్యలో గుట్టలుగా మెటీరియల్ ● వాహనచోదకుల అవస్థలు ● చోద్యం చూస్తున్న అధికారులు
అరకులోయటౌన్: విశాఖ – అరకు ప్రధాన రహదారి అరకులోయలో రోడ్డు మధ్యలో ఇసుక, నల్ల రాయి చిప్స్ నిల్వ చేయడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయలోని పోర్టు అతిథి గృహం ఎదురుగా ఉన్న రోడ్డు డ్రైనేడీ నిర్మాణం కోసం తీసుకువచ్చిన మెటిరియల్ గత వారం రోజులుగా రోడ్డుపై విడిచిపెట్టారు. డ్రైనేజీ నిర్మాణం చేయకపోవడం, రోడ్డు మధ్యలో మెటీరియల్ వేసి ఉంచడంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు మధ్యలో వేసి మెటీరియల్ తొలగించాలని వాహనచోదకులు, స్థానికులు కోరుతున్నారు.

ఇలాగైతే రాకపోకలు ఎలా?