
హైడ్రోపవర్ ప్రాజెక్టును రద్దు చేయాలి
పాడేరు రూరల్: అదానీ కంపెనీకు ప్రభుత్వం అప్పగించిన పెద్దకోట హైడ్రోపవర్ ప్రాజెక్టు రద్దు చేయా లని ఈ మేరకు విడుదల చేసి జీవో నంబర్ 51ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అనంతగిరి మండలం పెద్దకోట వద్ద ఏర్పాటుచేయనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టును అదానీ కంపెనీకు అప్ప గించిన్నట్టు జీవో నంబర్ 51ని జారీ చేయడం కూటమి ప్రభుత్వం నిరంకుశపాలనకు అద్దం పట్టే విధంగా ఉందన్నారు. పెద్దకోట ప్రాజెక్టు సామర్థ్యం 1800 ఎండబ్ల్యూకు పెంచడమే కాకుండ స్థానిక వాగు నుంచి 16.547 ఎంసీఎంల నీటిని తరలించడానికి కూడా అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. పెద్దకోట ప్రాంతం రాజ్యాంగం 5వ షెడ్యుల్ కింద గుర్తించిన ప్రాంతమని సర్వ హక్కు లు ఆదివాసీలకే ఉందనేది ప్రభుత్వం గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలతో అనుమతులు ఇవ్వడం చట్టారీత్య నేరమన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రత్యేకమైన చట్టాలు 1/70, పీసా చట్టాలు ఉన్నాయని, వీటిని ఉల్లంఘించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామసభల అనుమతులతోనే తీర్మాణం చేయాల్సి ఉందన్నారు, ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం చట్టాల ఉల్లంఘిండచమే అవుతుందన్నారు, అక్రమంగా జాఈ చేసిన జీవో నంబర్ 51ని తక్షణం రద్దు చేసి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు, లేని పక్షంలో ఆదివాసీలతో ఉద్యమం తీవ్రం చేస్తామని ఆయన హెచ్చరించారు.