
అల్లూరి జయంతి ఏర్పాట్లుపరిశీలన
గొలుగొండ: అల్లూరి పార్కులో వచ్చే నెల 4న అల్లూరి జయంతి ఘనంగా నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు సర్వం సిద్ధం చేయాలని నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ ఆదేశించారు. కృష్ణదేవిపేట గ్రామంలో అల్లూరి సమాధుల ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాటు పక్కాగా ఉండాలని తహసీల్దార్ శ్రీనువాసరావుకు సూచించారు. ఆ రోజు రాష్ట్రంలో ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులకు అల్లూరి ఉత్సవ కమిటీ సహకారం అందించాలని కోరారు.