
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
గొలుగొండ: ఏజెన్సీ నుంచి స్కూటీపై రెండు కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్‌ఐ రామారావు తెలిపారు. ఏజెన్సీలో చిట్టింపాడు నుంచి చింతపల్లి మండలానికి చెందిన తాంబేలు లక్ష్మి, కట్టు బంద స్కూటీపై వస్తుండగా, జోగుంపేట రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. స్కూటీ డిక్కీలో రెండు కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.
కొయ్యూరు: ద్విచక్ర వాహనంపై రంపుల గ్రామం నుంచి నర్సీపట్నంను గంజాయిని తరలిస్తున్న రంపుల గ్రామానికి చెందిన గల్లోరి బొంజిబాబు ను పోలీసులు పట్టుకున్నారు. గురువారం మంప ఎస్‌ఐ కె. శంకర్రావు చీడిపాలెం జంక్షన్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. బూదరాళ్ల దారిలో వస్తున్న బొంజిబాబు స్కూటిని తనిఖీ చేయగా రూ.లక్షా 91 వేల విలువ చేసే 38.3 కిలోల గంజాయిని కనుగొన్నారు.దీంతో అతడిని అరెస్టు చేసి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.ఆయన మాట్లాడుతూ ఈ దారిలో గంజాయిపై దృష్టి పెట్టామన్నారు.

గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు