
త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలి
● చింతూరు ఐటీడీఏ పీవో
అపూర్వభరత్ ఆదేశం
చింతూరు: సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన నాలుగు మండలాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వివిధ సమస్యలకు సంబంధించి 71 అర్జీలు రాగా, వాటిలో ఆర్‌అండ్‌ఆర్ సమస్యలపై 31 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ సమస్యలను పోలవరం కార్యాలయ అధికారులు పరిశీలించి పరిష్కారం చూపాలని పీవో ఆదేశించారు.