
సంపద కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి
చింతపల్లి: చెత్తనుంచి సంపద తయారు చేసే కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్ అన్నారు. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ కేంద్రంలో గల వర్మీ కంపోస్టు యూనిట్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీలోని అన్ని గృహ సముదాయాల నుంచి తడి, పొడి చెత్తను క్రమం తప్పకుండా సేకరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఐవీఆర్‌ఎస్ సర్వే జరుగుతున్నందున సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు,సర్పంచ్ వనగల. సోమరత్నం,ఈవోపీఆర్‌డీ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.