సాగు భారం | - | Sakshi
Sakshi News home page

సాగు భారం

Jun 9 2025 7:07 AM | Updated on Jun 9 2025 7:07 AM

సాగు

సాగు భారం

రైతుకు గ్రామస్థాయిలో వ్యవసాయ పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో గతవైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాకు 344 కేంద్రాలు మంజూరు కాగా వీటిలో 150 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఇవి కూడా ఆశయానికి తగ్గట్టుగా సేవలు అందించలేకపోతుండటంతో రైతులకు భరోసా కరువైంది.
భరోసా దూరం..

రంపచోడవరం: పంచాయతీ స్థాయిలో అన్ని రకాల సేవలు ఒకే చోట అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయాలు, పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఒకొక్క ఆర్‌బీకే భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు వెచ్చించింది. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించింది. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, శాస్త్రవేత్తల సూచనల కోసం స్మార్ట్‌ టీవీలను ఏర్పాటుచేసింది. అంతే కాకుండా విత్తనాలు, ఎరువులు పొందేందుకు కియోస్క్‌ మిషన్లు ఏర్పాటు చేసింది. విత్తనం నాటే దగ్గర నుంచి.. పంట కొనుగోలు వరకు కావాల్సినవన్నీ అందుబాటులోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. తమకు సక్రమంగా సేవలు అందడం లేదని రైతులు వాపోతున్నారు.

పెట్టుబడి సాయం ఏదీ?

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రైతులకు రూ.13,500 పెట్టుబడి సాయం అందించేది. అయితే కూటమి ప్రభుత్వం దీనికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. ఇప్పుడు రూ. 20 వేలు అందిస్తామని చెప్పి నేటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సాగు పెట్టుబడికి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కష్టాలు మొదలయ్యాయని వారు ఆవేదన చెందుతున్నారు.

ఏ రకం విత్తనం కావాలో తెలుసుకోకుండానే..

ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి గిరిజన రైతులకు 90శాతం రాయితీపై 22,644 క్వింటాళ్ల వరి విత్తనాలు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పెట్టింది. తమకు ఏరకం విత్తనాలు అవసరమనేది తెలుసుకోకుండానే ప్రతిపాదనలు పంపడం వల్ల ఏంటి ఉపయోగమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

● గత ప్రభుత్వంలో తాము ఆర్‌బీకేలకు వెళ్లి కావాల్సిన రకం విత్తనాలు, ఎరువులు కియోస్క్‌ మిషన్‌లో స్వయంగా నమోదు చేసుకునే వారమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కియోస్క్‌ మిషన్లు నిరుపయోగంగా మారాయి.

● రైతుల విజ్ఞానం కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్‌ టీవీలు సరిగ్గా వినియోగానికి నోచుకోలేదు. గత ప్రభుత్వంలో రైతులు సమయం దొరికినప్పుడు ఆర్‌బీకేలకు వచ్చి టీవీలో వ్యవసాయ సూచనలు తెలుసుకుని విజ్ఞానం పొందే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

నిరుపయోగంగా అగ్రి ల్యాబ్‌

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏజెన్సీ ప్రధాన కేంద్రం రంపచోడవరంలో నిర్మించిన అగ్రి ల్యాబ్‌ నిరుపయోగంగా మారింది. దీని నిర్మాణానికి రూ.2కోట్లు వెచ్చించింది. విత్తనాలు, ఎరువు, పురుగు మందులు నాణ్యతను పరీక్షించేందుకు ఈ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

● రాష్ట్రంలో వివిధ పాంతాల నుంచి వచ్చిన శాంపిళ్లను వీటిలో పరీక్షించి నాణ్యతను నిర్థారించేవారు. నాణ్యత లోపంతో ఉన్న ఎరువు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ప్రక్రియ ఎంతో దోహద పడేది. ఏడాది కాలంలో ఈ ల్యాబ్‌లో పరీక్షలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అగ్రి ల్యాబ్‌లోనే ఏడీ కార్యాలయం నిర్వహిస్తున్నారు.

ఆశయానికి దూరంగా ఆర్‌బీకేలు

అందని పెట్టుబడి సాయం

భూసార పరీక్షలకు నోచుకోని

అగ్రిల్యాబ్‌లు

నిర్వీర్యమే లక్ష్యంగా పాలన

కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు ఆసరా కరువు

ప్రభుత్వ సహకారం అవసరం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అనేక సేవలు పొందే వారు. ప్రస్తుతం అరకొరగా సేవలు అందుతున్నా యి. రైతులకు ఆధునిక సాంకేతిక సేవలు అందినప్పుడే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆర్‌బీకేల్లో రైతులకు సేవలు తూతూమంత్రంగానే అందుతున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభు త్వం స్పందించాలి. రైతులకు అవసరమైన అన్నిరకాల సాయం అందించగలిగితేనే సాగు ముందుకు సాగుతుంది. – మడకం పోతురాజు,

రైతు,దేవరాతిగూడెం

రైతులకు అందని సేవలు

తామరపల్లిలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ వ్యవసాయం కోసం తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎటువంటి పుస్తకాలు, టీవీలు అందుబాటులో లేవు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పొందే అవకాశం లేకుండా చేశారు. అధికారులు తమకు నచ్చిన విధంగా ప్రతిపాదనలు పెట్టి విత్తనాలు పంపిణీ చేసే పరిస్థితి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు ఉపయోగం లేకుండా ఉన్నాయి.

– శారపు బాపిరాజుదొర, రైతు,

గోపవరం, రంపచోడవరం మండలం

సాగు భారం1
1/5

సాగు భారం

సాగు భారం2
2/5

సాగు భారం

సాగు భారం3
3/5

సాగు భారం

సాగు భారం4
4/5

సాగు భారం

సాగు భారం5
5/5

సాగు భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement