
ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బొజ్జిరెడ్డి
రంపచోడవరం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా రంపచోడవరానికి చెందిన చోళ్ల బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొండ రెడ్డి గిరిజన తెగకు చెందిన బొజ్జిరెడ్డి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ 2009లో రంపచోడవరం నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా తిరిగి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు. పదవీ విరమణ తరువాత పూర్తి సమయాన్ని పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఆయన నియామకంపై బీజేపీ నాయకులు కారం సీతారామన్నదొర, ప్రసాద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.