
బైక్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఎటపాక: ఎదురుగా వస్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎటపాక మండలం సీతాపురం గ్రామానికి చెందిన అల్లాడి భాస్కరరావు(62) భద్రాచలంలో గృహనిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే గత రెండు నెలల నుంచి భద్రాచలంలోని తన కుమార్తె వద్ద ఉంటూ పనులకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం పనిలేకపోవడంతో స్వగ్రామం సీతాపురం వచ్చాడు. ద్విచక్రవాహనంపై తిరిగి భద్రాచలం బయలుదేరాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిపేట సమీపంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై భద్రాచలం నుంచి చింతూరు వైపు వస్తున్న చత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్‌రావు రహదారిపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అప్పలరాజు తెలిపారు.
ఘటన స్థలంలోనే
గృహ నిర్మాణ కార్మికుడి మృతి