తిమ్మాపురంలో విజయ్‌ దేవరకొండ సందడి | Sakshi
Sakshi News home page

తిమ్మాపురంలో విజయ్‌ దేవరకొండ సందడి

Published Fri, May 24 2024 11:30 AM

తిమ్మాపురంలో విజయ్‌ దేవరకొండ సందడి

కొమ్మాది : భీమిలి బీచ్‌ రోడ్డు తిమ్మాపురంలో ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ సందడి చేశారు. ఆయన నటిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ కోసం ఈ నెల 5న నగరానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆర్‌కే బీచ్‌, యారడ బీచ్‌ వద్ద ఏర్పాటు చేసిన సెట్ల వద్ద సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. బుధవారం తిమ్మాపురంలో ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో షూట్‌ కోసం ఇక్కడకు వచ్చారు. అభిమానులతో ఫొటోలు తీసుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని, ఇక్కడి ప్రకృతి అందాలు, బీచ్‌ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. వచ్చేనెల 3 వరకు నగరంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కొనసాగుతుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement