హైకోర్టు న్యాయమూర్తి రాక నేడు | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తి రాక నేడు

Sep 27 2023 12:54 AM | Updated on Sep 27 2023 12:54 AM

మహారాణిపేట: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకట రమణ బుధవారం విశాఖ వస్తున్నారు. ఉదయం 6 గంటలకు తాడిపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖ బయలు దేరుతారు. మధ్యాహ్నం 12.10 గంటలకు విశాఖలోని ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రుషికొండకు బయలుదేరి.. అక్కడ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రాత్రి తిరిగి సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకుని బస చేస్తారు. 28న ఉదయం 7 గంటలకు సింహాచలం వెళతారు. అక్కడ స్వామి దర్శనం అనంతరం తిరిగి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విజయవాడ బయలుదేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement