
జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికై న విద్యార్థులు
కొయ్యూరు: స్థానిక కుస్తీ అకాడమి విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చూపారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన అండర్ 14, అండర్ 17 విద్యార్థులు స్థానిక కుస్తీ అకాడమిలో శిక్షణ పొందుతున్నారు. వీరంతా ఇటీవల కృష్ణాజిల్లా నున్న జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. బంగారు పతకాలు 14 మంది, ఒకరు వెండి, ఏడుగురు బ్రాంజ్ పతకాలను సాధించారు. ఇదే అకాడమికి చెందిన అండర్ 14 విభాగంలో బాలురు ఓవరాల్ చాంపియన్‌షిప్ రెండో స్థానం, అండర్ 17 విభాగంలో బాలికలు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. అండర్ 17 విభాగంలో బంగారు పతకాలు సాధించిన రాణి, రుత్తు, కేశియా, నిర్మల, కమల, భార్గవి, శ్రావణి, బాలుర విభాగంలో వెంకటరమణ, కృష్ణబాబు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, వరప్రసాద్ భోపాల్‌లో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని అకాడమి కోచ్, పీడీ అంబటి నూకరాజు తెలిపారు.