
● నాటి టీడీపీ అడ్డగోలు సర్వేకు ప్రభుత్వం చెక్
● 2019 డిసెంబర్‌లో మరోసారి ముదపాక భూముల్లో సమగ్ర సర్వే
● అర్హులైన 179 మంది రైతులకు ఎల్‌పీవోలు జారీ
● ఓర్వలేక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కోర్టుల్లో కేసులు
ముదపాక భూముల్లో జగనన్న కాలనీల లేఅవుట్స్
దపాక భూముల్లో తన అనుయాయుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన అడ్డగోలు సర్వేలో అసలు నిజాలు ప్రభుత్వం మారిన తర్వాత బట్టబయలయ్యాయి. అర్హులైన లబ్ధిదారులకు మొండి చెయ్యి చూపించేలా పచ్చతమ్ముళ్లకు పప్పు బెల్లాల మాదిరిగా ముదపాక భూముల్ని పంచిపెట్టిన టీడీపీ అక్రమాలకు ప్రభుత్వం కొత్త సర్వేతో అడ్డుకట్ట వేసింది. 179 మంది రైతులను అసలైన అర్హులుగా గుర్తించి వారికి ఎల్‌పీవోలు జారీ చేసింది. ఈ భూముల్లో జగనన్న కాలనీలు నిర్మించి పేదలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అక్రమంగా లాక్కొన్న భూములు పేదల పరమవుతుండటంతో ఓర్వలేక.. కేసుల పేరుతో కక్ష తీర్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ము
