
‘ఉదారి’కి సారస్వత పరిషత్ పురస్కారం
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ ఉదారి నారాయణకు సారస్వత పరిషత్ పురస్కారం వరించింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అందజేసే ఈ పురస్కారాన్ని బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. పురస్కారంతోపాటు రూ.20వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా కవులు నారాయణకు అభినందనలు తెలిపారు.