Transport strike
-
భారీ పెనాల్టీలపై నిరసన: స్తంభించిన రవాణా
సాక్షి, న్యూఢిల్లీ : ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ పెనాల్టీలు వడ్డిస్తూ మోటార్ వాహన చట్టంలో చేపట్టిన సవరణలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో పలు ట్రాన్స్పోర్ట్ యూనియన్లు గురువారం సమ్మెకు పిలుపుఇచ్చాయి. రవాణా సమ్మెతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌ల సేవలు నిలిచిపోవడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ట్రక్కులు, బస్‌లు, ఆటోలు, టెంపోలు, మ్యాక్సి క్యాబ్స్ సహా అన్ని వాహనాలకు సంబంధించిన 41 సంస్థలు, సంఘాలతో కూడిన రవాణా సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌టీఏ) సమ్మెకు పిలుపు ఇచ్చింది. మోటార్ వాహన చట్టానికి చేసిన సవరణలు మార్చాలని, భారీ పెనాల్టీల నుంచి ఉపశమనం కల్పించాలని, ప్రైవేట్ వాహన డ్రైవర్లకు బీమా, వైద్య సదుపాయం కల్పించాలని ట్రాన్స్పోర్ట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. (చదవండి: హెల్మెట్ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!) -
రాజధానిలో స్తంభించిన రవాణా..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆటోలు, ట్యాక్సీలు నిలిచిపోయాయి. ట్రక్ డ్రైవర్ల సమ్మెతో పాటు పెట్రోల్ డీలర్ల సమ్మెతో రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవడంతో సోమవారం సమ్మెకు పిలుపు ఇచ్చామని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన తప్పుడు రవాణా విధానాలతో ఆటో రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లు తమ ఉపాధిని కోల్పోతున్నారని, యాప్ ఆధారిత క్యాబ్ సేవలు తమ ఉపాధిని దెబ్బతీశాయని సింగ్ చెప్పారు. మరోవైపు రవాణా సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించినందుకు నిరసనగా దేశ రాజధానిలో 400కు పైగా పెట్రోల్ పంపులను మూసివేయాలని పెట్రోల్ పంపుల యజమానులు నిర్ణయించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ 2.50 మేర సుంకాన్ని తగ్గించిన క్రమంలో యూపీ, హర్యానాలు సైతం వ్యాట్‌ను తగ్గించి ఊరట కల్పించాయని, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం వ్యాట్‌ను తగ్గించేందుకు నిరాకరిస్తోందని ఢిల్లీ పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నిశ్చల్ సింఘానియా ఆందోళన వ్యక్తం చేశారు. -
సంక్రాంతి దాకా బస్సులు బంద్?
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోర్టు ఆదేశించినా పట్టువీడలేదు. మంత్రి నోటీసులు జారీచేసినా ఖాతరు చేయలేదు. పైగా జాక్టో, జియోల సంఘీభావంతో రవాణాశాఖ ఉద్యోగ సంఘాల ఉద్యమం మరింత బలపడే దిశగా సాగుతోంది. ఆదివారం నాటికి సమ్మె నాలుగోరోజుకు చేరుకుంది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో జనం తీవ్రఅవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పటి వరకు సమ్మె వల్ల ప్రభుత్వానికి రూ.40 కోట్ల రాబడి ఆగిపోయింది. డిమాండ్లు పరిష్కారం కాకుంటే సంక్రాంతి(పొంగల్) వరకూ ఆందోళన కొనసాగించాలని సిబ్బంది భావిస్తున్నారు. పొంగల్ సందర్భంగా నడుపాలనుకున్న 12వేల ప్రత్యేక బస్సుల్లో సీట్ల రిజర్వేషన్ కూడా పూర్తయిన నేపథ్యంలో అధికారుల గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి. ఎందుకు సమ్మె? : తమిళనాడు ప్రభుత్వ రవాణాశాఖలో 1.43 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వేతనాలు పెంచాలని, వేతన చెల్లింపుల నుంచి మినహాయించుకున్న సొమ్మును వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో ఈనెల 4వ తేదీ నుంచి సమ్మె పాటిస్తున్నారు. ఆదివారం నాటికి సమ్మె నాలుగోరోజుకు చేరుకోగా రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం బస్సులు నిలిచిపోవడంతో సుమారు రూ.40 కోట్ల రాబడికిగండి పడింది. ఉద్యోగులు, విద్యార్థులు, పొరుగూళ్ల నుంచి వచ్చిన వారు బస్సు సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గందరగోళం.. ఆగమాగం : సమ్మెను నిర్వీర్యం చేయడాన్ని సవాలుగా తీసుకున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసేందుకు సిద్ధమైంది. కానీ ఎక్కడిక్కడ ఉద్యోగులు అడ్డుకోవడంతో అవికాస్తా విఫలమయ్యాయి. చెన్నైలో ఐదువేల ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టారు. చెన్నైలోని 35 డిపోల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తోన్న డ్రైవర్లు, కండక్టర్లను విధులకు పంపుతున్నారు. అయితే 16 గంటలపాటు పనిచేయించుకుని రూ.200 మాత్రమే దినసరివేతనం ఇస్తున్నారని కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. కొందరు డ్రైవర్లు రూట్ తెలియక పక్కదారి పడుతుండగా, మరికొందరు ప్రమాదాలు చేస్తున్నారు. దీంతో కొత్త డ్రైవర్లున్న బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు. రాష్ట్రం నలుమూలలా ఆందోళనకారులు 24 బస్సుల అద్దాలను పగులగొట్టారు. కోయంబత్తూరులో ఒక తాత్కాలిక డ్రైవర్ తలకు హెల్మెట్ పెట్టుకుని విధులు నిర్వర్తించాడు. చాలాచోట్ల ఆందోళనకారులు బస్సు టైర్లలో గాలి తీసేశారు. ఇదిలా ఉంటే ప్రైవేటు వాహనాలు ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నాయి. మెట్రో కళకళ : సాధారణంగా మెట్రో రైలు ప్రయాణం అంతగా ఆసక్తి చూపని చెన్నైవాసులు.. గడిచిన నాలుగు రోజులుగా తీరుమార్చుకున్నారు. సమ్మె మొదలైన నాటి నుంచి 75 వేల మంది ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు. ఇక లోకల్ ఎలక్ట్రిక్ రైళ్లలో శుక్రవారం ఒకే రోజే14 లక్షల మంది ప్రయాణించడం గమనార్హం. మరమ్మతుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించిన దక్షిణ రైల్వే.. సమ్మె కారణంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించకుంది. ఉద్యోగులకు నోటీసులు జారీ : సమ్మె విరమించకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరిస్తూ రవాణాశాఖ మంత్రి ఎం.ఆర్.విజయభాస్కర్ శనివారం ఉద్యోగులకు నోటీసులు జారీచేశారు. హైకోర్టు ఆదేశించిచా సమ్మెను కొనసాగించడంపై సోమవారం బదులిస్తామని సీఐటీయూ సంఘాలు ప్రకటించాయి. రవాణా ఉద్యోగులు, కార్మికుల కోర్కెలను తక్షణమే నెరవేర్చాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ సీఎంను కోరారు. గుండెపోటుతో డ్రైవర్ మృతి: చెన్నై తాంబరం కన్నడపాళయంకు చెందిన మోహన్ (50) అనే ఆర్టీసీ ఉద్యోగి శుక్రవారం రాత్రి గుండెపోటుకుగురై ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల ఒత్తిడి వల్లే అతను చనిపోయాడని బంధువులు ఆరోపింస్తున్నారు. -
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రవాణ సమ్మె!
-
నేడు జాతీయ రవాణా సమ్మె
- రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా బంద్ - ఆర్టీసీ, ఆటో సంఘాల మద్దతు - బస్సులు యథాతథం.. హైదరాబాద్: జాతీయ రోడ్డు భద్రత బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త రవాణా సమ్మె నేపథ్యంలో గురువారం రవాణా వ్యవస్థ స్తంభించనుంది. ముఖ్యంగా సరుకు రవాణా వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీకి చెందిన ఎన్ఎంయూ మినహా అన్ని యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చాయి. కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని యూనియన్లు పిలుపునిచ్చాయి. వేతన సవరణ చేయకపోవటాన్ని నిరసిస్తూ ఆరో తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జాతీయ సమ్మెకు సంఘీభావం మాత్రమే తెలపనున్నారు. దీంతో బస్సులు యథావిధిగా తిరిగే అవకాశముంది. బస్సు డిపోల ముందు భోజన విరామ సమయంలో మాత్రమే కార్మికులు నిరసన వ్యక్తం చేస్తారని సమాచారం. ఆటోకార్మిక సంఘాలు సమ్మెకు పూర్తి మద్దతు తెలపడంతో పాటు ఆటోలను రోడ్లపైకి తీసుకురావద్దని డ్రైవర్లను కోరడంతో ఆటోల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఫలితంగా ఆటోలు పాక్షికంగానే తిరిగే అవకాశముంది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించాలన్న కార్మిక సంఘాల విజ్ఞప్తి పట్ల లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల సంఘాలు సానుకూలంగా స్పందించాయి. దీంతో పాలు, మందులు లాంటి అత్యవసర సేవలందించే వాహనాలు మినహా మిగిలిన వాహనాలు నిలిచిపోనున్నాయి. పదిహేనేళ్ల జీవితకాలం పూర్తయిన వాహనాలు వాడొద్దంటూ నియంత్రణలను వ్యతిరేకిస్తున్న సరుకు రవాణా వాహన సంఘాల కోరిక మేరకు ఢిల్లీకి తెలంగాణ నుంచి సరుకు రవాణా వాహనాలు పంపించకూడదని ఇక్కడి సంఘాలు నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్‌లో ఆటోలు బంద్ రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా నగరంలోని ఆటో కార్మిక సంఘాలు బంద్ పాటించనున్నాయి. గురువారం నగర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గ్రేటర్ పరిధిలోని 1.30 లక్షల ఆటోల రాకపోకలు నిలిచిపోనున్నాయి. అలాగే అన్ని కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు లక్ష సరుకు రవాణా వాహనాలు, లారీలు స్తంభించిపోనున్నాయి. బంద్‌లో భాగంగా ఆర్టీసీ డిపోల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు బంద్‌లో పాల్గొనడం లేదని ప్రైవేటు ఆపరేటర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో ప్రైవేటు బస్సులు యథావిధిగా నడవనున్నాయి. -
రాకపోకలు బంద్
* ప్రవేశ పన్నుతో తెలంగాణ, ఏపీ మధ్య స్తంభించిన రవాణా * ఆగిపోయిన సరుకులు, నిత్యావసర వస్తువులు * నిలిచిపోయిన ఇసుక, సిమెంట్, ఇటుకల రవాణా భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం * మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే పనులన్నీ ఆగిపోయినట్లే! * ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు బస్సుల్లో తగ్గుదల.. కోర్టు మధ్యంతర * ఉత్తర్వులతో రోడ్డెక్కిన కొన్ని బస్సులు పన్ను మోతను ప్రజలపైనే వేస్తున్న * నిర్వాహకులు.. 30 శాతం వరకూ చార్జీల పెంపు * పన్నుపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన చేస్తామంటున్న లారీ యజమానుల సంఘాలు సాక్షి, హైదరాబాద్: వాహనాలపై ప్రవేశ పన్ను విధింపు ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణా, ప్రయాణికుల వాహనాలు ఆగిపోయాయి. నిత్యావసరాలైన పాలు, పండ్లు, కూరగాయలు, పూలు, తమలపాకులు, పప్పు దినుసులు వంటి నిత్యావసరాల రవాణాపైనా దీని ప్రభావం పడింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి వచ్చే ఇటుక, ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో భవన నిర్మాణ రంగంపైనా ప్రభావం పడింది. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే నిర్మాణాల పనులు ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు తరలించే ఇసుక, ఐరన్, సిమెంట్ తదితర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని భవన నిర్మాణ రంగ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ప్రవేశ సుంకం విధింపు నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. దీనికితోడు నిర్వాహకులు చార్జీలను భారీగా పెంచేయడంతో... ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ప్రవేశ పన్నును వెనక్కి తీసుకోకపోతే ఆందోళన చేపడతామని తెలంగాణ లారీ యజమానుల సంఘం హెచ్చరించింది. బస్సులన్నీ బంద్..: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు ప్రయాణీకుల బస్సులు నిత్యం 600 వరకూ వస్తుంటాయి. జీవో అమల్లోకి వచ్చిన మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ బస్సులన్నీ ప్రవేశపన్ను చెల్లించాల్సి రావడంతో... 90 శాతానికిపైగా ఏపీలోనే నిలిచిపోయాయి. దీంతో రోజూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే 50 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా... అవి ప్రయాణికుల అవసరాలు తీర్చడం లేదు. ఇక ఏపీ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వెయ్యి వరకూ రవాణా వాహనాలు వస్తుంటాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పాలు, కూరగాయలు, సిమెంట్, ఇతర నిత్యావసర వస్తువులను, కర్నూలు జిల్లా నుంచి ఉల్లిగడ్డను హైదరాబాద్‌కు రవాణా చేస్తుంటాయి. కానీ ప్రవేశ సుంకం కారణంగా మంగళ, బుధవారాల్లో 25 నుంచి 30 శాతం రవాణా వాహనాలు మాత్రమే నడిచాయి. మోత మోగిస్తున్న ఆపరేటర్లు ప్రవేశ పన్ను నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు చార్జీలు పెంచేసి, భారాన్ని ప్రజలపైకి నెట్టేశారు. ప్రభుత్వం విధించిన పన్ను ప్రకారం 50 సీట్లున్న బస్సుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 1.83 లక్షలు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే పన్ను చెల్లించిన ఆపరేటర్లు ఇక నుంచి.. రెండు రాష్ట్రాల్లో సీటుకు రూ. 3,675 చొప్పున కట్టాల్సిందే. ఇందుకు అనుగుణంగానే ప్రైవేటు బస్సుల నిర్వాహకులు చార్జీలను పెంచేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, అమలాపురం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, కడప, బెంగళూరు తదితర ప్రాంతాలకు రోజూ 600కు పైగా ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. అదే పండుగలు, వేసవి సెలవుల వంటి రద్దీ రోజుల్లో ఈ సర్వీసులు రెట్టింపవుతాయి. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి ప్రైవేటు ఆపరేటర్లు తరచుగా చార్జీల్లో మార్పులు చేస్తుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్ను దృష్ట్యా చార్జీలను ఒక్కసారిగా పెంచేశారు. ఇవి ముందు ముందు ఇంకా అవ కాశం కూడా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ. 450 చార్జీ ఉండగా.. దానిని రూ. 600కు పెంచేశారు. వైజాగ్ వెళ్లడానికి ఇటీవలి వరకు రూ. 850గా ఉన్న చార్జీ ఇప్పుడు రూ. 1,050కి పెరిగింది. తిరుపతికి రూ. 650 నుంచి రూ. 830కి పెంచారు. ప్రజలపై తీవ్ర భారం.. ‘‘ఇప్పటివరకు 23 జిల్లాల్లో సరుకు రవాణా చేస్తూ ఉపాధిని పొందుతున్నాం. పన్ను విధింపు వల్ల తెలంగాణలోని 10 జిల్లాలకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇది మా ఉపాధికి పెద్ద దెబ్బ. అక్కడి వాహనాలు కూడా 13 జిల్లాలకే పరిమితమవుతాయి. రెండు రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు వల్ల ఆ భారం అంతిమంగా ప్రజలపైనే పడుతుంది. ప్రభుత్వానికి వచ్చే రూ. 40 కోట్ల ఆదాయం కంటే ప్రజలపై పడే రూ. 400 కోట్ల భారం గురించి ఆలోచించాలి. ఏపీ వాహనాలపై పన్ను విధిస్తూ విడుదల చేసిన జీవో 15ను వెంటనే రద్దుచేయాలి. లేదంటే మా ఆందోళనను ఉధృతం చేస్తాం..’’ - ఎన్.భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం వెనుకా ముందూ ఆలోచించరా? ‘‘వాహనాలపై పన్ను కేసును హైకోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా హామీ పత్రాలు ఇచ్చి రాకపోకలు సాగించవచ్చని చెప్పింది. తుది తీర్పు కూడా మాకే అనుకూలంగా వస్తుందన్న నమ్మకం ఉంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఏ అవసరమొచ్చినా ఏపీ ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిందే కదా. వెనుకాముందు ఆలోచించకుండా పన్ను విధించడం వల్ల భారం పడేది ప్రజలపైనే.. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా..?’’ - సుభాష్ చంద్రబోస్, ప్రైవేట్ ఆపరేటర్ల సంఘం -
నేటి నుంచి రవాణా సమ్మె?
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర రవాణాశాఖ సిబ్బంది మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. జీతాల పెంపు తదితర 21 డిమాండ్ల సాధనపై ఈనెల 3వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సమ్మె పాటించాలని నిర్ణయించారు. అయితే సమ్మెను విరమింపజేసేందుకు సోమవారం చర్చలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు, కార్మికుల కథనం ప్రకారం.. రాష్ట్ర రవాణాశాఖలో 1.42 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ అమలుచేస్తున్న 11వ వేతన సవరణ ఒప్పందం 2013 ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. 12వ వేతన సవరణ ఒప్పందం అదే ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. వేతన సవరణను అమలుచేసేముందు సిబ్బందితో చర్చలు జరపాలని ప్రభుత్వం పేచీ పెట్టింది. ఇందుకు సిబ్బంది సైతం సమ్మతించగా చర్చల పేరుతో జాప్యం చేస్తూ వచ్చింది. విసిగిపోయిన రవాణాశాఖలోని 11 ఉద్యోగ, కార్మిక సంఘాలు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి గత ఏడాది డి సెంబర్ 28వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సమ్మెకు పూనుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సులన్నీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఊళ్లకు వెళ్లే బస్సులతోపాటు సిటీ బస్సులు సైతం షెడ్లకే పరిమితం కావడంతో ప్రజల రాకపోకల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార అన్నాడీఎంకే పార్టీ జేఏసీలో చీలికతెచ్చింది. అన్నాడీఎంకే అనుబంధ కార్మిక సంఘం సభ్యులను విధుల్లోకి దింపడంతో కొన్ని బస్సులు రోడ్లపైకి చేరుకున్నాయి. అయితే అధిక శాతం బస్సుల సేవలు కరువయ్యాయి. రవాణాశాఖ మంత్రి సెంథిల్‌బాలాజీ జేఏసీ నేతలతో చర్చలు జరిపి రవాణా కార్మికుల, ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చేందుకు ఒక అధికారిక బృందాన్ని నియమిస్తున్నట్లు హామీ ఇచ్చారు. దీని ద్వారా డిసెంబర్ 31వ తేదీన సమ్మె విరమింపజేశారు. రాాష్ట్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి ఉమానాథ్ నాయకత్వంలో ఏర్పడిన బృందం సమస్యను మళ్లీ పక్కనపెట్టేసింది. జేఏసీ ఒత్తిడి చేయడంతో గత నెల 11వ తేదీన చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఆ రోజు సంఘాల నుంచి వినతిపత్రాలు స్వీకరించడమేగానీ చర్చలకు పూనుకోలేదు. మోసపూరిత వ్యవహారం, మభ్యపెట్టడం వంటి కార్యక్రమాలతో రవాణా ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వంచిస్తోందని జేఏసీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ చేష్టలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 3వ తేదీ నుంచి సమ్మెకు దిగాలని తీర్మానించారు. చర్చలు ప్రారంభం మరో 24 గంటల్లో కార్మికులు సమ్మెకు దిగబోతున్న తరుణంలో ఉమానాథ్ హడావిడిగా సోమవారం చర్చలకు సిద్ధమయ్యారు. క్రోంపేటలోని రవాణాఖ ఉద్యోగుల శిక్షణ కార్యాలయంలో జేఏసీ నేతలతో చర్చలు ప్రారంభించారు. ప్రభుత్వంపై నమ్మకంలేని కారణంగా మంగళవారం నుంచి సమ్మెకు దిగేందుకు తమ సన్నాహాలు కొనసాగిస్తున్నట్లు జేఏసీ నేతలు చెప్పారు.