breaking news
train journeys
-
సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్.. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుంటే మరో యాప్, ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక్కో యాప్. ఈ విధానానికి ఐఆర్సీటీసీ మంగళం పడనుంది. ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనుంది.ఐఆర్సీటీసీ ప్రారంభించనున్న ఈ సూపర్ యాప్‌ను.. రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులకు ఉపయోగించుకోవచ్చు. ఇది 2024 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను తీసుకువస్తున్నారు.ఇండియన్ రైల్వే లాంచ్ చేయనున్న సూపర్ యాప్‌ను సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం) అభివృద్ధి చేస్తోంది. దీనికి యాప్ టికెట్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ పాస్‌లు, ఫుడ్ డెలివరీ వంటి వాటిని అనుసంధానిస్తోంది. అంటే ఈ ఒక్క యాప్‌లోనే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ప్లాట్‌ఫామ్ పాస్ వంటివన్నీ కూడా పొందవచ్చు. అంతే కాకుండా ట్రైన్ జర్నీ స్టేటస్ కూడా ఇందులోనే తెలుసుకోవచ్చని సమాచారం.ఇండియన్ రైల్వే సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్డ్ పార్టీ యాప్‌ల మీద ఆధారపడే అవసరం ఉండదు. ట్రైన్ జర్నీ చేసేవారు ఎక్కువ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం తీరిపోతుంది. ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా.. వినియోగదారు అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
ప్రయాణికులకు సమైక్య సెగ
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడుతోంది. దాదాపు 18 రోజులుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి ఆ సంస్థ కార్మికులు సైతం ఉద్యమబాట పట్టడంతో జనం ప్రైవేటు వాహనాలు, రైళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రైవేటు వాహనదారులు రెట్టింపునకు పైగా చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడుతోంది. దీంతో రోజువారీ రైళ్లలో ప్రయాణం చేసేవారి కన్నా 80 శాతం మంది ప్రజలు అధికంగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లలో చోటు సరిపడక, గంటల తరబడి నిలబడి గమ్యానికి చేరుకోవటానికి ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. మచిలీపట్నం-విజయవాడ, నరసాపూర్-గుంటూరు ప్యాసిం జరు, మచిలీపట్నం-విశాఖపట్నం, భీమవరం-గుడివాడ ప్యాసింజరు రైళ్లు నడుస్తుండగా అన్నీ కిక్కిరిసిన వెళ్తున్నాయి. మామూలు రోజుల్లో అయితే గుడివాడ నుంచి రోజుకు సుమారు ఏడు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరిగింది. రైల్వేస్టేషన్‌లోని టిక్కెట్ కౌంటర్లు సైతం ప్రయాణికులు టిక్కెట్ల కోసం క్యూ కట్టడంతో వారు టిక్కెట్ తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు సరిపడునన్ని సౌకర్యాలు లేక అవస్థలు తప్పడంలేదు. మరోపక్క కిక్కిరిసిన రైళ్లలోకి ఎక్కలేక చాలామంది స్టేషన్లోనే ఉండిపోతున్నారు. ఇక పిల్లలతో ప్రయాణాలు చేసేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రైలు మార్గంలేని గ్రామాలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహనాల దోపిడీ.. సమైక్య ఉద్యమాన్ని అదునుగా చేసుకుని ప్రైవేటు వాహనదారుల దోపిడీ పెరిగింది. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న ఆటో డ్రైవర్లు గుడివాడ-విజయవాడకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యుడిపై పెనుభారం పడుతోంది. రైళ్లు మాత్రం ఒకటి రెండు తిరగడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి అదనపు వేళల్లో రైళ్లను నడిపితే ప్రయాణికులకు మేలు చేసిన వారవుతారని కోరుతున్నారు.