breaking news
pension payments
-
ప్రైవేటు బ్యాంకులకు సై
న్యూఢిల్లీ: ఇంతకాలం ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లు తదితర వ్యాపారం ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని దిగ్గజ ప్రైవేటు బ్యాంకులకే సొంతం కాగా.. ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ ఇందుకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. పన్నుల వసూళ్లు, పెన్షన్ చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు పథకాల సేవలు సహా అన్ని రకాల ప్రభుత్వాల వ్యాపార లావాదేవీల నిర్వహణకు అన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం కస్టమర్లకు సేవల పరంగా సౌకర్యాన్నిస్తుందని, పోటీని, సేవల్లో సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖా పేర్కొంది. ‘ప్రభుత్వ వ్యాపారం ప్రైవేటు బ్యాంకులు నిర్వహించే విషయమై ఉన్న ఆంక్షలను తొలగించాము. ఇప్పుడు అన్ని బ్యాంకులు పాల్గొనొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రైవేటు బ్యాంకులూ సమాన భాగస్వాములు’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆంక్షలు తొలగించడంతో ప్రైవేటు బ్యాంకులనూ ప్రభుత్వ వ్యాపారం, ప్రభుత్వ ఏజెన్సీ వ్యాపార నిర్వహణకు.. ప్రభుత్వరంగ బ్యాంకులతో సమానంగా గుర్తించేందుకు ఆర్బీఐకి అధికారాలు లభించినట్టు అయింది. -
పింఛను చెల్లింపులు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా పేద వితంతువులకు నెలకు రూ.1,000ల పింఛను ఇస్తున్నాయి. అయితే పిల్లలున్న వితంతువులు ఎవరూ ఈ వెయ్యి రూపాయల తోటే బతకలేరు. వీరి పిల్లలు బతుకుతెరువుకోసం సుదూర పట్టణా లకు వలసపోతున్నారు. వితంతువులు పింఛను పొందడానికి ప్రతినెలా పింఛను పంచే పోస్టాఫీసులు వీరిని స్వయంగా అక్కడకు వచ్చి తీసు కోమంటున్నాయి. అయితే వీరికి వచ్చే పింఛనులో సగం పైగా రాకపో కల ఖర్చుకే అయిపోతోంది. ఇలాకాక, కేంద్రప్రభుత్వ పద్ధతిలో ఈ లబ్ధి దారులను పోస్టాఫీసులో సేవింగ్స్ అక్కౌంటు తెరిపించి ఆ అక్కౌం టులో ప్రతి నెలా పింఛను జమచేయాలి. సంవత్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా లబ్ధిదారు స్వయంగా పోస్టుమాస్టరు వద్ద హాజరై, బతికి ఉన్నాననే సర్టిఫికెట్‌పై సంతకం పెడితే సరిపోతుంది. వితంతువులైతే తాము తిరిగి పెళ్లి చేసుకోలేదని ప్రమాణ పత్రం ఇవ్వాలి. వయో భారంతో నడక కూడా సమస్యగా ఉన్న వితంతువు లను పింఛన్ తీసుకోవడం కోసం ప్రతినెలా పోస్టాఫీసులకు రావాలని ఆదేశించడం అమానుషం. లబ్ధిదారుల ప్రయోజనం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసి అభాగ్యుల బాధను తగ్గించాలి. త్రిపురనేని హనుమాన్ చౌదరి కార్ఖానా, సికింద్రాబాద్ -
ఖజానాకు తాళం
సాక్షి, కాకినాడ : రాష్ర్ట విభజన నేపథ్యంలో ట్రెజరీ కార్యకలాపాలు ఏకంగా పది రోజులకు పైగా స్తంభించనున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో మే నెలకు సంబంధించి జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియ వారం రోజుల ముందుగానే పూర్తయింది. సాధారణంగా జూన్ ఒకటిన ఈ చెల్లింపులు జరుగుతాయి. పెన్షన్లయితే ఐదో తేదీ వరకు చెల్లిస్తారు. విభజన నేపథ్యంలో ఈ చెల్లింపుల ప్రక్రియ శనివారంతో ఫుల్స్టాప్ పెట్టేందుకు ట్రెజరీ శాఖాధికారులు తలమునకలయ్యారు. ఈ నెల 25 నుంచి అపాయింటెడ్ డే మరుసటి రోజు వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరపరు. ముఖ్యంగా ట్రెజరీపరంగా చెల్లింపులు, వసూళ్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకే.. జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల వేతనాలు, టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులతో పాటు పింఛన్ల చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రెజరీ శాఖ వారం రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురైంది. 21వ తేదీతో బిల్లుల స్వీకరణకు 24వ తేదీ చెల్లింపులకు గడువుగా ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నానా హైరానా పడ్డారు. సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో ఉండే బిల్లులను జిల్లా కేంద్రానికి రప్పించి, సర్వర్‌తో అనుసంధానం చేసి బిల్లుల ల్లింపును పూర్తిచేశారు. ఇప్పటి వరకు జరిగిన వ్యయాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖాతాలో లెక్కించారు. ఇక నుంచి జరిగే బిల్లులను రెండు రాష్ట్రాల ఖాతాలో జమ చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మళ్లీ మార్గదర్శకాల తర్వాతే.. జిల్లాలో 58 వేల మంది ఉద్యోగులుండగా, 40 వేల మంది వరకు ప్రభుత్వ పింఛనుదారులున్నారు. ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాల కింద ప్రతీనెలా రూ.107 కోట్ల చెల్లింపులు జరుగుతాయి. పింఛనుదారులకు పెన్షన్ల రూపంలో రూ.66 కోట్ల వరకు చెల్లిస్తారు. మరో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వివిధ బిల్లుల కింద చెల్లింపులు జరుగుతాయి. బిల్లుల చెల్లింపులన్నీ నెల పొడవునా జరుగుతుంటాయి. జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు మాత్రం ప్రతీ నెలా మొదటి వారంలోనే చేస్తారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చెల్లింపులన్నీ పది రోజుల ముందుగానే చెల్లిస్తారు. అయితే ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేసే వారికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ నెలాఖరులోగానే చెల్లింపులు జరిపేలా ఏర్పాట్లు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మినహా ఇతర చెల్లింపులను ఈ నెల 25 నుంచి పూర్తిగా నిలిపి వేయనున్నారు. శనివారం సాయంత్రం నుంచి ట్రెజరీ శాఖకు సంబంధించిన సర్వర్‌ను పూర్తిగా లాక్ చేయనున్నారు. ప్రతీ రోజు ఈ శాఖ ద్వారా సరాసరి రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర చెల్లింపులు జరుగుతుంటాయి. ఆ మేరకు రానున్న పది రోజులు నిలిచిపోనున్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు కూడా నిలిచిపోనున్నాయి. దీనివల్ల ఆయా పనులకు విఘాతం కలగనుంది. గతంలో మంజూరై, ప్రస్తుతం పనులు జరుగుతున్న వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులను రాష్ర్ట విభజన అనంతరం పునఃప్రారంభిస్తారు. వాస్తవానికి అపాయింటెడ్ డే తర్వాత కొత్త రాష్ర్ట కార్యకాలాపాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఈ నెల 26 నుంచే అందుకు సంబంధించి అంతర్గతంగా ప్రాథమిక స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటితో చెల్లింపులన్నీ నిలిపివేస్తున్నామని జిల్లా ట్రెజరీ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పీఎస్ సూర్యప్రకాశ్ ‘సాక్షి’కి తెలిపారు. అపాయింటెడ్ డే తర్వాతే ట్రెజరీ శాఖకు కొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరపబోమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారం రోజుల ముందుగానే జీతభత్యాలు, టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులు, పింఛన్లు అందుకున్న ఉద్యోగులు, పింఛనుదారులు రాష్ర్ట విభజన అనంతరం సకాలంలో జీతభత్యాలు, పింఛన్లు అందుతాయో, లేదోననే ఆందోళనలో ఉన్నారు.