breaking news
jhanmabhoomi
-
అనుపల్లిలో 'జన్మభూమి' బహిష్కరణ
చిత్తూరు : చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. తాగునీటి సమస్యను పరిష్కరించిన తర్వాతే గ్రామాంలోకి అధికారులు రావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చిన అధికారుల ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. చంద్రగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జోక్యంతో గ్రామస్తులు శాంతించారు. తాగునీటి సమస్యను అధికారులు త్వరలోనే పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దాంతో గ్రామస్తులు నిరసనను విరమించారు. -
పార్టీ ఎమ్మెల్యేలనే చంద్రబాబు నమ్మటం లేదు
గుంటూరు : గుంటూరులోనే రాజధాని నిర్మాణమన్న ముఖ్యమంత్రి ఉడా పరిధిలోని ఎమ్మెల్యేలను కలిపి ఒక కమిటీగా వేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మంత్రులు నారాయణ, పల్లె రఘునాధరెడ్డి లాంటి మంత్రులను నియమించటం వల్ల రైతులు తమ సమస్యలు చెప్పుకోలేరన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలనే చంద్రబాబు నమ్మటం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందన్నారు. జన్మభూమిలో ప్రోటోకాల్ పాటించకుండా పార్టీ కార్యక్రమంలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు, ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.