breaking news
Exporters Financial
-
ఎగుమతిదారులకు ఆర్బీఐ ఊరట
ముంబై: ఎగుమతిదారులకు ఆర్బీఐ ఉపశమన చర్యలను ప్రకటించింది. కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వస్తు, సేవల ఎగుమతిదారులకు ఊరట కల్పించింది. విదేశీ కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు స్వీకరించడం, భారత్‌కు పంపుకునేందుకు 15 నెలల గడువు ఇచ్చింది. ఎగుమతి చేసిన తేదీ నుంచి ఈ గడువు అమల్లోకి వస్తుంది. అది కూడా ఈ ఏడాది జూలై 31 వరకు ఎగుమతి చేసే వాటికి ఇది వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ గడువు ఎగుమతి చేసిన నాటి నుంచి 9 నెలలుగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘వేస్ అండ్ మీన్స్’ కింద తాను ఇచ్చే రుణాల పరిమితిని 30% పెం చాలని నిర్ణయించింది. ప్రభుత్వాల ఆదా యాలు, చెల్లింపుల మధ్య అంతరాన్ని అధి గమించేందుకు వేస్‌అండ్‌మీన్స్ కింద తాత్కాలిక రుణాలను ఇస్తుంటుంది. వాస్తవానికి వేస్‌అండ్‌మీన్స్ పరిమితిని సమీక్షించేందుకు ఆర్బీఐ ఓ సలహా కమిటీని ఏర్పాటు చేయగా, కమిటీ నుంచి నివేదిక ఇంకా రావాల్సి ఉంది. కౌంటర్ సైక్లికల్ క్యాపిటల్ బఫర్ (సీసీవైబీ)ను ప్రస్తుతం అమలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు సమయానుకూలంగా నిర్వహించాల్సిన నగదు నిల్వలను సీసీవైబీగా పేర్కొంటారు. -
ఎగుమతిదారులకు సకాలంలో ట్యాక్స్ రిఫండ్స్!
ఆర్థికమంత్రి హామీ న్యూఢిల్లీ: ఎగుమతిదారులు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం హామీ ఇచ్చారు. వారికి సకాలంలో, సత్వర ప్రాతిపదికన పన్ను రిఫండ్స్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎగుమతుల పెంపునకూ తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎఫ్ఐఈఓ (ఎగుమతి సంఘాల భారత సమాఖ్య) ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ నేతృత్వంలోని ఒక ప్రతినిధుల బృందం ఆర్థికమంత్రితో సమావేశం అయ్యింది. అనంతరం సమావేశ వివరాలను సమాఖ్య ఒక ప్రకటనలో వివరించింది. ఆయా అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచీ వడ్డీ సబ్సిడీ స్కీమ్ ప్రారంభానికి జోక్యం చేసుకోవాలని ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఆర్థికమంత్రిని కోరారు.