breaking news
Asafoetida
-
Asafoetida ఐదేళ్ల శ్రమ.. ఇంగువ పండిందోచ్!
ఇంగువ.. (Heeng or asafoetida) మన ఆహార సంస్కృతితో విడదీయరాని అనుబంధం ఉన్న సుగంధ్ర ద్రవ్యం. భారతీయ వంటకాల్లో ఇంగువకు విశిష్ట స్థానం ఉంది. ఏ వంటకంలో అయినా చిటికెడు వేస్తే చాలు. అతి తక్కువ పరిమాణంలో వినియోగించినా అత్యంత ప్రభావశీలతనుచూపే విశిష్ట ద్రవ్యం. ఇది కూడా ఒక మొక్క నుంచే వస్తుంది. వేలకొలదీ పంటల జీవ వైవిధ్యానికి ఆలవాలమైనభారతదేశంలో ఇంగువ పంట మాత్రం లేదంటేఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజం. ప్రతి ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. 2022–23లో 1,442 టన్నుల (విలువ రూ. 1,504 కోట్లు) ఇంగువను దిగుమతి చేసుకుంటున్నాం.అయితే, సరికొత్త కబురేమిటంటే.. శీతల ఎడారుల్లో పండే ఈ పంటనుఇప్పుడు మన దేశంలోనూ పండించటం ప్రారంభించాం. భారతీయఇంగువ పంట సాగు చరిత్రలో 2025 మే 28 ఒక మైలురాయి. విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి, మన దేశపు వాతావరణానికిమచ్చిక చేసుకొని, సాగు చేయటంలో విజయం సాధించినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ సిఎస్ఐఆర్ అధికారికంగా ప్రకటించిన రోజిది. అన్నట్లు.. వంటకాల్లోనే కాదు, ఔషధంగానూ.. పంటలనుఆశించే తెగుళ్ల నివారణకూ ఇంగువ మందే! భారతీయ ఇంగువ పంటకుశుభారంభం జరిగిన సందర్భంగా ఆవిశేషాలేమిటో తెలుసుకుందాం.. మనం వాడుతున్న ఇంగువ శాస్త్రీయ నామం ‘ఫెరుల అస్స–ఫోటిడ’ ((Ferula assa-foetida). ఇంగువ సాధారణ వాతావరణంలో పండదు. అతిశీతల ఎడారి ప్రాంతాల్లో పండుతుంది.ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో సాగు చేయటం ప్రారంభం. బయోరిసోర్స్ సెంటర్ (ఐహెచ్బిటి)లోని శాస్త్రవేత్తలు ఐదేళ్లుశ్రమించి ఇంగువ పంటను ఎట్టకేలకు మచ్చిక చేసుకున్నారు. ఈ విషయాన్ని మే 28న ప్రకటించారు. ఐహెచ్బిటి పాలంపూర్ క్యాంపస్‌లో ఇంగువ విత్తనోత్పత్తి కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రారంభించారు. మొదటి విడత ఇంగువ మొక్కల నుంచి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో, ఇక మన దేశంలో ఈ పంట పండించగలం అని శాస్త్రవేత్తలు ప్రకటించారు.ఫలించిన ఐదేళ్ల శ్రమఐహెచ్బిటి శాస్త్రవేత్తలు 2018లో తొలుత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి ఇంగువ మొక్క విత్తనాలను అధికారికంగా జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) ద్వారా క్వారంటైన్ వ్యవస్థ ద్వారా దిగుమతి చేసుకున్నారు. ఆ విత్తనాలను ప్రత్యేక నియంత్రిత వాతావరణంలో సాగు చేసి, వాటి ద్వారా ప్రమాదకరమైన చీడపీడలేవీ దిగుమతి కావటం లేదని నిర్థారణ అయిన తర్వాతే విత్తనాలను మన వాతావరణంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత టిష్యూకల్చర్ పద్ధతిలో ఇంగువ మొక్కలను అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియ మొత్తానికీ ఐదేళ్ల సమయం పట్టింది.ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్మహాభారత కాలంలోనే... ఇంగువ ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాలతోపాటు, మహాభారతం వంటి పురాతన గ్రంథాల్లోనే ఉంది. ఇంద్రియాలను, మానవ చేతనను శుద్ధి చేయటానికి ఇంగువను వాడేవారు. కడుపు నొప్పి, అజీర్తి నివారణకు.. వంటకం రుచిని పెంపొందించటం కోసం ఇంగువను ఉపయోగపడుతుందని చరక సంహిత చెబుతోంది. పిప్పాలడ సంహిత,పాణిని రచనల్లోనూ ఇంగువ ఉనికి ఉంది.–4 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకుఅతి తక్కువ వర్షపాతం పడే అతి శీతలప్రాంతాల్లో ఇంగువ మొక్క పెరుగుతుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాల్లో అనాదిగా సాగవుతోంది. నీరు నిలవని, తేమ తక్కువగా ఉండే ఇసుక నేలల్లో పెరుగుతుంది. ఏడాదికి 200 ఎం.ఎం. కన్నా తక్కువ వర్షపాతం ఉండాలి. 10–20 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నప్పుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. శీతాకాలంలో –4 డిగ్రీల చలిని కూడా తట్టుకుంటుంది. అతిశీతల, అతి వేడి వాతావరణ పరిస్థితుల్లో ఇంగువ మొక్క నిద్రావస్థకు వెళ్లిపోతుంది. వాతావరణం అనుకూలించాక మళ్లీ చిగురిస్తుంది. అందుకే హిమాచల్‌ప్రదేశ్‌లోని లహాల్–స్పిటి జిల్లాల్లో ఈ పంట సాగుపై శాస్త్రవేత్తలు ఐదేళ్లుగా చేసిన ప్రయోగాలు ఫలించాయి. ఇంగువ మొక్కకు తల్లి వేరు నేలలోపలికి వేరూనుకుంటుంది. మందపాటి ఆ వేరు నుంచి, దుంప నుంచి సేకరించిన జిగురు వంటి పదార్ధాన్ని సేకరిస్తారు. దాన్ని ఎండబెట్టి, ప్రాసెస్ చేస్తే.. జిగురు పరిమాణంలో 40–64% మేరకు ఇంగువ వస్తుంది. ఔషధంగా వాడే ఇంగువ వేరు. వంటకు వాడే ఇంగువ వేరు. ఔషధంగా వాడే ఇంగువనే పంటలపై తెగుళ్ల నివారణకూ వాడుతుంటారు. ఇంగువ మొక్క పెరిగి పూత దశకు ఎదగడానికి ఐదేళ్ల సమయం పడుతుంది. చదవండి: దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్ : ఎగబడుతున్న జనం2018లో విదేశాల నుంచి తెచ్చిన విత్తనాలను క్వారంటైన్ లాంఛనాలన్నీ పూర్తి అయ్యాక 2020 అక్టోబర్ 15న మన దేశ వాతావరణంలో నాటారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహాల్ లోయలోని క్వారింగ్ గ్రామంలో మొదట నాటడం ద్వారా భారతీయ ఇంగువ పంట సాగు ప్రారంభం అయ్యింది. ఐహెచ్బిటి పాలంపూర్‌లో ఏర్పాటైన జెర్మ్ప్లాజమ్ రీసోర్స్ సెంటర్లో ఇంగువ విత్తనోత్పత్తి, శిక్షణ, ఇంగువ ఉత్పత్తి తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడే టిష్యూ కల్చర్ యూనిట్ కూడా ఏర్పాటు కావటంతో విస్తృతంగా ఇంగువ మొక్కల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పంట సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడానికి జిపిఎస్ డేటా ఆధారంగా పెద్ద కసరత్తే జరిగింది. ఎకలాజికల్ నిచే మోడలింగ్ పద్ధతిలో అనువైన స్థలాలను గుర్తించటం, సాగు చేయటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వారి ఐదేళ్ల కృషికి గుర్తింపుగా గత నెల 28న అధికారికంగా ఇంగువ పంటను మన నేలలకు అలవాటు చేసి, విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అతిశీతల ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఇంగువ మొక్కల్ని సముద్రతలానికి 1,300 మీటర్ల ఎత్తులో ఉండే పాలంపూర్ వంటిప్రాంతాల్లో సాగు చేయటంలో విజయం సాధించటమే మనం సాధించిన ఘన విజయంగా శాస్త్రవేత్తలు సంబరంగా చెబుతున్నారు. సుసంపన్నమైన వ్యవసాయక జీవవైవిధ్యానికి ఒకానొక కేంద్ర బిందువైన భారతావని సిగలో మరో కొత్త పంట సరికొత్త ఘుమఘుమలతో చేరటం మనందరికీ సంతోషదాయకం. ఆ విధంగా హిమాచల్ రైతులు పండించే ఇంగువను మున్ముందు మనం రుచి చూడబోతున్నామన్నమాట! -
Asafoetida : ఇంగువతో ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలు
ప్రతీ వంట ఇంట్లో ఇంగువ (ఆసఫోటిడా) ఘుమఘుమ లాడుతుంది. వాసన ఘాటుగా, చేదు రుచితో లభించే సుగంధ ద్రవ్యం . కొన్నిసార్లు "డెవిల్స్ డంగ్" అని పిలుస్తారు.దీని వాసన అంత ఇష్టంగా ఉండక పోయిన్పటికీ ఆహారాన్ని మంచిరుచిని ఇస్తుంది. అలాగే దీని వలన ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా..!ఇంగువ ఆరోగ్యానికి మంచిది. పప్పు, సాంబారు, పులిహోర, రసం, పచ్చళ్లలో ఇంగువ లేని పోపును ఊహించలేం. ఇది మంచి ప్రిజర్వేటివ్‌గా కూడా పనిచేస్తుంది. ఇంగువను తీసుకోవటం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపులో ఉన్న గ్యాస్ , ఎసిడిటీలకు చెక్ పెడుతుంది. కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్‌తో సహా కొన్ని కొవ్వులనుంచి అధిక రక్త స్థాయిలను తగ్గిస్తుంది. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఇంగువలో ఉండే కూమరిన్స్ అనే రసాయనాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి.జలుబు, దగ్గు సమస్యలను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులోని యాంటీబయోటిక్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లోమెంటరీ లక్షణాలు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను కూడా తొలగిస్తాయి. అంతేకాదు స్వల్పపరిమాణంలో నెలసరి టైం లో వచ్చే పొత్తి కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది. కప్పు నీళ్లను బాగా మరగబెట్టి దీనిలో చిటికెడు ఇంగువ వేసి రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే తలనొప్పి కూడా మాయం అవుతుంది. ఇంగువను వాము బెల్లంతో కలిపి తీసుకోవటం వలన నులి పురుగుల సమస్య తగ్గుతుంది.సౌందర్య సాధనాలలో ఆహారాలు , పానీయాలలో సువాసన పదార్ధంగా ఉపయోగిస్తారు. కుక్కలు, పిల్లులు దూరంగా ఉంచే ఉత్పత్తులలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఇంగువను మితంగా తీసుకోవడం ఉత్తమం. -
ఇంగువతో ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా..
ఇంగువ.. వంటల్లో వాడే మంచి సుగంధ ద్రవ్యం ఇది. అసఫోటిడా అని కూడా దీన్ని పిలుస్తారు. మన దేశీ వంటకాల్లో ఇంగువని చాలా విరివిగా వాడుతుంటాం. దీనిలోని సహజ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. ఇంగువను పురాతన కాలం నుంచి అజీర్తికి ఇంటివైద్యంగా ఉపయోగిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇంగువను చర్మ సంరక్షణలోనూ ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా? మృతకణాలు తొలగించి ముఖం కాంతివంతంగా మారడానికి ఇంగువ ఉపయోగిస్తారు. ►రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాలపాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు పోతాయి. చర్మం పొడిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది. ►తేనె ఇంగువ సూపర్ కాంబినేషన్. ఈ రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్లెన్సర్‌గా ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న బాక్టీరియాను తొలగించవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. -
చిటికెడు ఇంగువతో చీడ దూరం!
ఇంటిప్స్ ⇒ పూల మొక్కలకు పురుగు పడితే... నీటిలో కొంచెం ఇంగువ కలిపి మొక్క మొదలులో పోస్తే చీడ వదిలిపోతుంది. పూలు కూడా బాగా పూస్తాయి. ⇒ బట్టల షెల్ఫుల్లో చిన్న చిన్న పురుగులు చేరి కొట్టేస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే షెల్ఫులో ఓ మూల రెండు ఎండు మిరపకాయలు పెట్టాలి. ⇒ గాజు సామాన్లపై మరకలు పడినప్పుడు.. నిమ్మనూనెలో ముంచిన స్పాంజి ముక్కతో తుడిస్తే వదిలిపోతాయి. ⇒ కర్పూరాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కొద్దికొద్దిగా హరించుకుపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కర్పూరం డబ్బాలో నాలుగు మిరియపు గింజలు వేయాలి. ⇒ పాతబడిన ఫర్నిచర్ కొత్తగా మెరవాలంటే... ఆలివ్ నూనెలో కొంచెం వెనిగర్ కలిపి తుడవాలి. ⇒ పప్పు దినుసును నిల్వ చేసే డబ్బాలో కొన్ని వెల్లుల్లి రేకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. ⇒ పాతబడ్డ ఉడెన్ ఫర్నీచర్ కొత్తగా మెరవాలంటే.. వేడినీళ్లలో రెండు టీబ్యాగ్‌లను ఉంచండి. పదినిమిషాలయ్యాక వాటిని తీసేసి... మెత్తటి బట్ట తీసుకొని ఆ డికాషన్‌తో ఫర్నీచర్‌ను తుడవండి.