Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Election Campaign Schedule At Repalle
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న(సోమవారం) మూడు నియోజకవ­ర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్‌ మహల్‌ సెంటర్‌లో జరిగే సభకు సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

Judgment on Kavitha bail petitions
బెయిలా.. రిమాండ్‌ కొనసాగింపా?

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్‌ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్‌ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్‌ కోరారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్‌ కోరారు. కేవలం ఇతరుల స్టేట్‌మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్‌ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్‌ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్‌ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్‌ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్‌ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా.  

‘ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో మీ భూమికి భద్రత’  అంటూ రామోజీరావు(రారా)కు చెందిన ఈటీవీ అన్నదాత ప్రసారం చేసిన కార్యక్రమం
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు

సాక్షి, అమరావతి: ఒకరు నారా... మరొకరు రారా (రామోజీరావు)! ఒకరికి 75... మరొకరికి 87. ఇద్దరికీ ఏళ్లు వచ్చినా బుద్ధి మాత్రం రాలేదు! ముందొక మాట చెప్పి.. ఆ వెంటనే నాలుక మడత పెట్టడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త వాగ్దానాలు, రంగురంగుల మేనిఫెస్టోతో తయారైపోవటం చంద్రబాబు సహజ లక్షణం. 2014లో వందల హామీలిచ్చేసిన బాబు... ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేర్చటం తన తరం కాదని తెలిసి ఏకంగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసేశారు. ఆఖరికి తన పార్టీ వెబ్‌సైట్లో నుంచి కూడా తీసేశారు. రామోజీరావూ సేమ్‌ టూ సేమ్‌! కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రామోజీ గతంలో బాగా ప్రశంసించారు. దీన్లో ఉన్న అంశాలను వివరిస్తూ... ఈ చట్టంతో రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుంది కనుక ఇది చాలా మంచి చట్టమంటూ తన ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ఓ స్టోరీని ప్రసారం చేశారు. ఇపుడు ఎన్నికల వేళ సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక... ఇంకా అమల్లోకే రాని ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ టీడీపీ విష ప్రచారం మొదలెట్టింది. టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ‘ఈనాడు’ శక్తి మేరకు విషం చిమ్ముతోంది. ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేశ్‌ అయితే ‘మీ భూములు జగన్‌ ప్రభుత్వం లాక్కుంటుంది జాగ్రత్త..!’ అంటూ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ గతంలో ప్రసారం చేసిన కథనాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం బయటపెట్టారు. వీడియో లింక్‌ను అందరికీ షేర్‌ చేశారు. దీంతో తన బండారం బయటపడి పోయిందని గ్రహించిన రామోజీరావు.. క్షణాల్లో ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి డిలీట్‌ చేయించారు. ఇపుడు ఆ లింకుపై క్లిక్‌ చేసిన వారికి... ‘దిసీజ్‌ ప్రైవేట్‌ వీడియో’ అనే మెసేజ్‌ కనిపిస్తోంది. ఇది చూసినవారు బాబు, రామోజీ ఇద్దరూ ఇద్దరే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీని పబ్లిక్‌గా ప్రసారం చేస్తున్నపుడు దాన్లోని వీడియోలు ప్రైవేట్‌వి ఎలా అవుతాయి? ఈ ప్రశ్నకు రామోజీ దగ్గర సమాధానం లేదు.  గుడ్డలిప్పిన గురుశిష్యులు! కొద్దిరోజులుగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు పరివారం బట్టలు విప్పుకుని బరి తెగించి చెబుతున్న మాయమాటలు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన మాయోపాయాలేనని తేలిపోయింది. భూ హక్కు చట్టంపై చెబుతున్న బూటకపు కబుర్లన్నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కారు కూతలేనని బయటపడింది. ఈ చట్టం చాలా మంచిదని, రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ స్వయంగా రామోజీ మీడియానే గతంలో అనేక కథనాలు అచ్చేసింది. ఈటీవీలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయగా, చట్టం అద్భుతమని కితాబిస్తూ ఈనాడులోనూ కథనాలు రాశారు. రాష్ట్రంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి ఈటీవీ అన్నదాతలో నాలుగు నెలల క్రితం ‘టైటిల్‌ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ప్రముఖ భూ చట్టాల నిపుణుడు, హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం.సునీల్‌కుమార్‌ ఈ చట్టం వస్తే రాష్ట్రంలోని భూముల వ్యవస్థ ఎంతగా మారిపోతుందో చాలా కూలంకషంగా వివరించారు.   చంద్రబాబు కోసం హఠాత్తుగా యూటర్న్‌ రామోజీ గతంలో తాను ఈ చట్టానికి అనుకూలంగా ప్రసారం చేసిన వీడియోకి విరుద్ధంగా ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి కోసం తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి వ్యతిరేకంగా బురద జల్లే బాధ్యత తనపై వేసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత ఉంటుందని చెప్పిన నోటితోనే అది దుర్మార్గమంటూ నిస్సిగ్గుగా నాలుక మడతేశారు. రైతుల భూములు తెల్లారేసరికల్లా ఇతరుల పేరు మీదకు మారిపోతాయని, సీఎం జగన్‌ ప్రజల స్థిరాస్తులు లాక్కునేందుకే ఈ చట్టం తెచ్చారంటూ బరితెగించి దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఈ అడ్డగోలు ప్రచారంతో ప్రజల మెదళ్లను విషపూరితం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం చాలా మంచిదంటూ ఈటీవీ ప్రసారం చేసిన వీడియో తాజాగా వైరల్‌ కావడంతో పచ్చ మంద నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అందులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది రాష్ట్రానికి అవసరమని, ఎంతో ప్రయోజనకరమని చెప్పిన అంశాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భూ హక్కుల చట్టం గురించి అంత గొప్పగా చెప్పి అది వస్తే భూములకు భరోసా వస్తుందని కితాబిచ్చిన రామోజీ ఇప్పుడు సిగ్గు విడిచి భూములు పోతాయని కల్లబొల్లి మాటలు చెప్పడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. చంద్రబాబు హయాంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించి వదిలేసిన భూదార్‌ ప్రాజెక్టుకు ఈ చట్టం కొనసాగింపు అంటూ అదే కథనంలో ఈటీవీ కార్యక్రమంలో ప్రసారం చేశారు. అది అబద్ధమే అయినా సీఎం జగన్‌ హయాం­లో వచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు చేయలేక వదిలేసిన భూదార్‌ గురించి ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గొప్పదనం, దాని ఆవశ్యకత, రైతులకు చేకూరే  ప్రయోజనాలు, భూముల వ్యవస్థలో వచ్చే మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు. ఎంతో మంచి చట్టమని కితాబిచ్చిన రామోజీ ఎన్నికల వేళ ఈ స్థాయికి దిగజారడంపై ప్రజ­ల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిబట్టి ఈనాడు, ఈటీవీ కార్యక్రమాలన్నీ ప్రజలను మభ్యపుచ్చడం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మరోసారి స్పష్టమైందని పేర్కొంటున్నారు.   ఆదరాబాదరాగా అదృశ్యం.. ఈ వీడియోతో తమ పరువు బజారున పడిందని గ్రహించడంతో నాలుక కరుచుకున్న రామోజీ ఆదరబాదరగా యూట్యూబ్‌లోని ఈటీవీ ఛానల్‌లో దాన్ని ఎవరూ చూడకుండా చేశారు. 2014 ఎన్నికల్లోనూ ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేశాడు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండడంతో వాటి గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించి తన దొంగ బుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు రామోజీ కూడా ఎంతో మంచిదని తాను ప్రసారం చేసిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వీడియోను ఈటీవీ యూట్యూబ్‌ ఛానల్‌లో కనపడకుండా మాయం చేశారు. తద్వారా రామోజీ, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలు పట్టని గురు శిష్యులని మరోసారి స్పష్టంగా రుజువైంది. కాగా 2019లో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం బిల్లుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతివ్వడం గమనార్హం. ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందంటూ బిల్లుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూటర్న్‌’ తీసుకుని మీ భూములు లాక్కుంటారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు పెడబొబ్బలు పెడుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకని నిపుణులు ప్రశి్నస్తున్నారు.   ఈటీవీలో ఏం చెప్పారంటే.. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్‌ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. మీకు భూమి ఉంటే అది పట్టాదార్‌ పాస్‌ పుస్తకంలోగానీ ఆన్‌లైన్‌ రికార్డులోగానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో భూములున్నా సరైన పాస్‌ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు లేక రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి భూ యజమానులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్‌ రిజిష్టర్‌లో ఎవరి పేరు ఉంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది.  

Upcoming OTT Release Movies In Telugu May 2nd Week
ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ తర్వాత అంటే సోమవారం (మే 13) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'కృ‍ష్ణమ్మ' అనే మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. మరోవైపు ఓటీటీలో కూడా 15కి పైగా మూవీస్-సిరీస్‌లు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ విషయానికొస్తే దాదాపు 16 సినిమాలు/సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్-హిందీ సినిమాలు/వెబ్ సిరీసులే ఉన్నాయి. అయితే 'ఆవేశం' అనే డబ్బింగ్ మూవీతో పాటు '8 ఏఎమ్ మెట్రో' చిత్రం మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‪‌గా ఓటీటీల్లో ఏ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మే 06-12వ తేదీ వరకు)నెట్‍‌ఫ్లిక్స్ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) - మే 09లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10అమెజాన్ ప్రైమ్ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 09 (రూమర్ డేట్)మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 09ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09 హాట్‌స్టార్ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 08జీ 58 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10జియో సినిమామర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) - మే 10సోనీ లివ్ఉందేకి సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 10లయన్స్ గేట్ ప్లేద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 10సన్ నెక్స్ట్ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) - మే 10ఆపిల్ ప్లస్ టీవీడార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

Madhapur CI Birthday Celebration On Cable Bridge
Cable Bridge: కేబుల్‌ బ్రిడ్జిపై పోలీసుల బర్త్‌ డే వేడుక

గచ్చిబౌలి: కేబుల్‌ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా..సెల్ఫీలు దిగినా, ఫుట్‌ పాత్‌రెయిలింగ్‌ , గ్రిల్స్‌ వద్ద నిలబడి వచ్చి పోయే పాదచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్‌ 76 హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ ఏప్రిల్‌ 16న ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీపీ ఆదేశాలు భేఖాతర్‌ చేస్తూ కేబుల్‌ బ్రిడ్జిపై మాదాపూర్‌ ఎస్‌హెచ్‌ఓ గడ్డం మల్లేష్‌తో పాటు మరో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు బర్త్‌ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది.  కేక్‌ కట్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. కేబుల్‌ బ్రిడ్జిపై వాహనదారులతో పాటు సందర్శకులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా... పోలీసులకు వర్తించవా అని సోషల్‌ మీడియా ప్రశ్నించడం గమనార్హం. బర్త్‌ డే వేడుకలో మాదాపూర్‌ ఎస్‌హెచ్‌ఓ ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ వినీత్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో పటాన్‌చెరు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రవణ్‌ కేబుల్‌ బ్రిడ్జి ఫుట్‌పాత్‌ పై కేక్‌ కట్‌ చేయగా , మాదాపూర్‌ ఎస్‌హెచ్‌ఓ మల్లేష్‌ ఆయనకు కేక్‌ తినిపిస్తున్నారు. ఈ ఫొటోలో రాజేంద్రనగర్‌ సీసీఎస్‌ ఇన్‌సెక్టర్‌ సంజయ్, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్‌ పాత్‌ మీదే ఉన్నామని మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ తెలిపారు.   

Ravindra Jadeja breaks MS Dhonis massive record for CSK in IPL history
IPL 2024: చ‌రిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు

ఐపీఎల్‌-2024లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 28 ప‌రుగ‌ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జడేజా కీల‌క పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో తొలుత బ్యాటింగ్‌లో 42 ప‌రుగులతో అద‌ర‌గొట్టిన జ‌డ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను జ‌డ్డూకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వ‌రిచింది.ఈ క్ర‌మంలో జ‌డేజా ప‌లు అరుదైన ఘ‌న‌త‌ల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే త‌ర‌పున అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆట‌గాడిగా జ‌డ్డూ నిలిచాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో 16 సార్లు మ్యాన్ ఆఫ్‌ది అవార్డుల‌ను గెలుచుకున్నాడు.ఇంత‌కుముందు ఈ రికార్డు సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును జ‌డేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మ‌రో రికార్డును జడ్డూ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు 40 పైగా ప‌రుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్‌, షేన్ వాట్స‌న్ స‌ర‌స‌న జ‌డేజా చేరాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు 40 ప్ల‌స్ స్కోర్‌, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్స‌న్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్ల‌స్ స్కోర్‌, 3 వికెట్లు తీశారు.

Sakshi Editorial On Mayabazar Movie Summer
వేసవి అభ్యాసం

‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్‌’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్‌.ఆర్‌. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్‌’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్‌’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్‌ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్‌’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు.  తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్‌ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్‌’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్‌... నమో నమః 

CM YS Jagan wife YS Bharathi Reddy Election campaign At Vemula
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి భారతమ్మ

వేముల: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. వైఎస్సార్‌ జిల్లా వేములలో ఆదివారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్‌ జగన్, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్‌ భారతమ్మ, ఆమె సోదరుడు, ప్రముఖ వైద్యుడు ఈసీ దినేశ్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారతమ్మపై అభిమానం చూపారు. ఆమెను చూడగానే చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. వేముల మెయిన్‌ రోడ్డు, ఎస్సీ కాలనీ, శేషన్నగారిపల్లె, బచ్చయ్యగారిపల్లెల్లో భారతమ్మ, ఈసీ దినేశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సోదరి శ్వేతారెడ్డి.. జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ లింగాల ఉషారాణి, వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, పీసీబీ డైరెక్టర్‌ మరక శివకృష్ణారెడ్డిలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక టీసీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రచారంలో అవ్వాతాతలను, మహిళలు, పెద్దలను ‘అన్న బాగున్నారా.. అవ్వా బాగున్నారా’  అంటూ భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటి వద్ద వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధనను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేశారని తెలిపారు. పేదల సంక్షేమ పథకాలు కొనసాగడానికి మరోసారి వైఎస్‌ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌కు మెండుగా ప్రజల ఆశీస్సులు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించిందని భారతమ్మ తెలిపారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ను ప్రజలు మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ విజయాన్ని ఆపలేరన్నారు. ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు.  

Daily Horoscope Rasi Phalalu May 06-05-2024 Telugu
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.త్రయోదశి ప.1.13 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: రేవతి సా.4.40 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ప.2.25 నుండి 3.56 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.36, సూర్యాస్తమయం: 6.17. మేషం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.వృషభం: కుటుంబంలో ఆనందంగా గడుపుతారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మిథునం: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలోగౌరవం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు.కర్కాటకం: కొత్తగా చేపట్టిన పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు.సింహం: బంధువిరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి అవాంతరాలు.కన్య: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.తుల: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.వృశ్చికం: దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ఆటంకాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. సోదరులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో వివాదాలు.మకరం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో ఉన్నతా«ధికారుల నుంచి ఒత్తిడులు.మీనం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all