
తప్పిదాలతోనే మరింత పెర్ ఫెక్ట్!
ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ ఫెక్ట్(అభ్యాసం కూసి విద్య) అనేది మనకు తెలిసిన నానుడి. ఎర్రర్స్ మేక్ ఏ మ్యాన్ పెర్ ఫెక్ట్( తప్పదాలతోనే మరింత నేర్పు) అనేది మనకు తెలుసున్నతెలియని నిజం.
న్యూయార్క్: ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ ఫెక్ట్(అభ్యాసం కూసు విద్య) అనేది మనకు తెలిసిన నానుడి. ఎర్రర్స్ మేక్ ఏ మ్యాన్ పెర్ ఫెక్ట్( తప్పదాలతోనే మరింత నేర్పు) అనేది మనకు తెలుసున్నతెలియని నిజం. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. 'నేర్చుకునే సమయంలో ఒకే టాస్క్ లో చోటు చేసుకుని రెండు పరిణామాలు' అనే అంశంపై యూఎస్ లోని జాన్స్ హాప్ కిన్స్ యూనివరర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి.
ఒక పనిని నేర్చుకునే సమయలో చేసిన తప్పును తిరిగి మళ్లీ చేసినట్లయితే.. వాటి నుంచి గుణపాఠం నేర్చుకుని మరింతగా రాటుదేలతామట. సాధారణంగా తప్పులు జరుగుతున్నప్పుడు ఆ సమాచారాన్ని మెదడులోని నాడీ కణాలు ఒకచోట నుంచి మరొక చోటికి చేరవేస్తూ మనల్ని అప్రమత్తం చేస్తుంటాయట. మనలో ఏర్పడే ఆ రెండు పరిణామాలతోనే మనం మరింత మెరుగు అవుతామని ప్రొఫెసర్ రెజా షెద్ మెహర్ స్పష్టం చేశారు. ఇందులో మొదటిది మనం నేర్చుకుని పనిమీద దృష్టి పెడితే.. మరొకటి మనం చేసే తప్పుల్ని సూచిస్తూ అప్రమత్తం చేస్తుందట. వాటి నుంచి ఒకసారి చేసిన తప్పలు మళ్లీ చేయకుండా ఉండేందుకు ఉపయోగపడతాయని వారు తెలిపారు. ఇలా జరుగుతున్నక్రమంలోనే ఆ తప్పులు మనలో నుంచి పూర్తిగా వైదొలిగా ఒక సంపూర్ణ మైన నైపుణ్యం సాధించడానికి ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ రెజా షెద్ మెహర్ తెలిపారు.