సైబర్‌ వల.. తప్పించుకోవడం ఎలా..!

Telangana Women Protection Department Started New Program - Sakshi

‘సైబ్‌హర్‌’ఆన్‌లైన్‌ ప్రాజెక్టుకు ‘విమెన్‌ సేఫ్టీ వింగ్‌’ శ్రీకారం

జూలై15 నుంచి అవగాహన కార్యక్రమాలు

దేశంలోనే వినూత్న యత్నం

సాక్షి, హైదరాబాద్‌: మహిళా రక్షణ విభాగం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా విస్తరిస్తోన్న వేళ మనిషి జీవనవిధానం మారిపోయింది. నిత్యావసరాలు, అత్యవసరా లు, విద్య, ఉద్యోగం అన్నీ ఆన్‌లైన్‌కి మారాయి. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులకు సైబర్‌ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. కోవిడ్‌ తరువాత కూడా ఆన్‌లైన్‌ వినియోగం, దానిపై ఆ ధారపడే అవకాశాలు ఏమాత్రం తగ్గేలా లేవు.

ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు ఆన్‌లైన్‌లో పొంచిన ఉన్న ప్రమాదాలు, ముప్పును ఎలా తప్పిం చాలి? సురక్షిత, ఆరోగ్యకరమైన ఆన్‌లై న్‌ వాతావరణం ఎలా పొందాలి? అన్న విషయాలపై విస్తృత చర్చ జరగాలని తెలంగాణ విమెన్‌సేఫ్టీ వింగ్‌ నిర్ణయిం చింది. తెలంగాణ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జూలై 15 నుంచి ఆన్‌లైన్‌లో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి యూని సెఫ్‌ (ఐక్యరాజ్యసమితి చిన్నారుల అత్యవసర నిధి) సహకారం అందించేందుకు ముందుకు రావడం విశేషం. ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఇంతటి విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టడం ఇదే ప్రథమం కావడం విశేషం.

ఉద్దేశం ఏమిటి?: ఆన్‌లైన్‌లో పాటించాల్సిన భద్ర త ప్రమాణాలు, పిల్లలకు ఎలాంటి సైబర్‌ వేధింపు లు, ఎరలు, సవాళ్లు ఉంటాయి? వాటి ని ఎలా అధిగమించాలి? అన్న సందేహాలకు శాశ్వత పరిష్కారాలు సూచిం చడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో పలువురు మహిళా ఐపీఎస్, ఐఏఎస్, డీఎస్పీలు, ఎన్జీవో ప్రతినిధులు, లా యర్లు, సైబర్‌ నిపుణులు, విద్యార్థులు, మహిళా ఉద్యోగినులు, సైకాలజిస్టు లు, కౌన్సెలర్లు పాల్గొంటారు. రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలలు, సీబీఎస్‌ ఈ, ఐసీఎస్‌ఈ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులను భాగస్వాములను చేస్తారు. దీని పై విద్యాశాఖ కార్యదర్శి చిత్రారామచంద్రన్‌తోనూ విమెన్‌సేఫ్టీ వింగ్‌ వారు చర్చలు జరిపారు. 

ప్రతీ రోజూ వినూత్నంగా..
జూలై 15 నుంచి ఆన్‌లైన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ఒక్కోరోజూ ఒక్కో అం శంపై చర్చలు, విశ్లేషణలు సాగుతా యి. విద్యార్థులు, మహిళా ఉద్యోగుల సందేహాలకు సమాధానాలిస్తారు. పా ల్గొనేవారిలో అధికశాతం విద్యార్థులే ఉంటారు కాబట్టి, వారు విసుగు చెందకుండా..వారిని పూర్తిగా భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించా రు. ఆన్‌లైన్‌భద్రత, సైబర్‌సేఫ్టీపై క్విజ్, వ్యాసాలు, కథల వంటి వాటితో అవగాహన కలిగిస్తారు. దీనిపై ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top