ఓయూ లేడిస్‌ హాస్టల్‌ ఆగంతకుడు అరెస్ట్‌

Police Commissioner Anjani Kumar Press Meet Over Osmania Ladies Hostel Case - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్‌ హాస్టల్‌లో చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌  నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో పొట్టేలా రమేశ్‌, సన్నీలను ఇద్దరు నిందితులుగా గుర్తించామన్నారు. అదేవిధంగా ఈ ఇద్దరు పాత నేతస్తులని పేర్కొన్నారు.

వీరిలో సన్నీ అనే నిందితున్ని ఆరెస్టు చేశామన్నారు. రమేశ్‌ గతంలో పీడి యాక్ట్‌ కింద జైలుకు వెళ్లాడని తెలిపారు. వీరిద్దరు హాస్టల్‌లో ఫోన్లు దొంగలించడానికి వెళ్లారని.. ఏ2 నిందితుడు సన్నీ హాస్టల్‌ బయట ఉండగా.. ఏ1 రమేశ్‌ లోపలికి వెళ్లారని తెలిపారు. బాత్‌రూం ద్వారానే హాస్టల్‌ లోపలికి వెళ్లి మళ్లీ ఆక్కడి నుంచే దొంగలు బయటకు వచ్చారని చెప్పారు. బాత్‌రూం నుంచి బయటకు వస్తుండగా ఓ అమ్మాయి కంటబడగా.. దీంతో ఆమెపై దాడి చేశారని తెలిపారు. ఈ కేసులో ఏ1 పొట్టేలా రమేశ్‌ దొరికితే మరిన్ని విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top