5 సార్లు ఎమ్మెల్యే అయినా.. రూ.5 భోజనమే

Gummadi Narsaiah Eat GHMC Rs5 Meals in Baghlingampally - Sakshi

ముషీరాబాద్‌: ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే అతని జీవన విధానం మారిపోతుంది. షడ్రసోపేతమైన భోజనం..స్టార్‌ హోటల్‌కు తగ్గకుండా విలాసవంతమైన జీవనం వారి సొంతం అవుతుంది. అలాంటిది ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యే అయితే..? ఆయన జీవన విధానం ఎలా ఉంటుందో ఉహించుకోవచ్చు. కానీ నీతి, నిజాయితీకి, సాదాసీదా జీవితానికి నిలువెత్తు నిదర్శమైన గుమ్మడి నర్సయ్య మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద పేదల కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనాన్ని ఆరగించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నర్సయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన సైకిల్‌పై తిరగడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తినడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం అని చెప్పొచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top