టెస్టులకు కుల్దీప్‌.. కోహ్లి హింట్‌! | Virat Kohli Says Anything is Possible With The Selections For Tests | Sakshi
Sakshi News home page

Jul 13 2018 11:36 AM | Updated on Jul 13 2018 11:36 AM

Virat Kohli Says Anything is Possible With The Selections For Tests - Sakshi

భారత్‌ ఆటగాళ్లు

టెస్టు సెలక్షన్‌లో ఏమైనా జరగొచ్చు.. సర్‌ప్రైజ్‌ కూడా ఉండొచ్చు.

నాటింగ్‌హామ్‌: టీమిండియా స్పిన్నర్‌, చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌కు ఆతిథ్య ఇంగ్లండ్‌ మరోసారి చిక్కుకుంది. గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కుల్దీప్‌ (10–0–25–6)కు తోడు రోహిత్‌ శర్మ శతకం తోడవడంతో భారత విజయం సులువైంది. అయితే ఈ పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్‌ టెస్టుల్లో కూడా అవకాశం లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఈ విజయానంతరం కెప్టెన్‌ కోహ్లి ముందు ఈ విషయం ప్రస్తావించగా.. సానుకూలంగా స్పందించాడు. ‘టెస్టు సెలక్షన్‌లో ఏమైనా జరగొచ్చు.. సర్‌ప్రైజ్‌ కూడా ఉండొచ్చు. చహల్‌, కుల్దీప్‌లు చాలా రాటుదేలారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్‌ వారి బౌలింగ్‌లో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మమ్మల్నివారిని తీసుకోనేలా టెంప్ట్‌ చేయోచ్చు.’ అని హింట్‌ ఇచ్చాడు. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్‌.. వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.

ఆ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌నిచ్చింది: కుల్దీప్‌
ఇక పటిష్ట స్థితిలో కుదురుకున్న ఇంగ్లండ్‌ను దెబ్బతీయడంపై కుల్దీప్‌ స్పందిస్తూ..‘  నా జీవితంలో ఇది ఓ గొప్పరోజు. తొలి ఓవర్లను అద్బుతంగా ప్రారంభించాను. అదృష్టవశాత్తు తొలి రెండు ఓవర్లలోనే వికెట్లు దక్కాయి. మైదానం చిన్నదా.. పెద్దాదా అనేది నాకు పెద్దవిషయం కాదు. తొలి ఓవర్‌ అనంతరం బంతి బాగా తిరుగుతుందని గ్రహించా. ఈ రోజు నేను కొత్తగా ఆడాను. ఎవరైనా సరైన ప్రదేశాల్లో వైవిధ్యంగా బంతిని వేస్తే బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పెడ్తారు. తదుపరి మ్యాచ్‌కు వారు మంచి సన్నాహకంతో వస్తారని నాకు తెలుసు’ అని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement