చాంపియన్‌ సూర్య 

Surya Alakanti Wins Chess Title - Sakshi

తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో సూర్య ఆలకంటి విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీ అండర్‌–17 బాలుర విభాగంలో సూర్య విజేతగా నిలిచాడు. నాలుగు రౌండ్ల పాటు పోటీలు జరుగగా సూర్య 4 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 3 పాయింట్లతో శివతేజ, పి. వెంకట జశ్వంత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా శివతేజ రన్నరప్‌గా, జశ్వంత్‌ మూడో స్థానాన్ని అందుకున్నారు. అండర్‌–15 బాలికల విభాగంలో నిషా (4 పాయింట్లు), స్నేహ (4 పాయింట్లు), మనోజ్ఞ (2 పాయింట్లు)... బాలుర కేటగిరీలో విశ్వ (4.5 పాయింట్లు), ఆకాశ్‌ (4 పాయింట్లు), సాయి పవన్‌ (3.5 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు.  

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు 

అండర్‌–7 బాలురు: 1. దివ్యాన్షు, 2. హరిరామ్, 3. చరణ్‌; బాలికలు: 1. సాధన, 2. కీర్తి, 3. శాన్వి. అండర్‌–9 బాలురు: 1. సాత్విక్, 2. శ్రీవంత్‌ శర్మ, 3. ఆదిత్య శ్రీరామ్‌; బాలికలు: 1. లహరి, 2. హృతిక, 3. సంహిత. అండర్‌–11 బాలురు: 1. ప్రణయ్, 2. సహర్ష, 3. సాకేత్‌రామ్‌ సాయి; బాలికలు: 1. ఇషాన్వి, 2. నిగమశ్రీ, 3. నిఖిత. అండర్‌–13 బాలురు: 1. రిత్విక్, 2. శశాంక్, 3. శ్రీధన్వి; బాలికలు: 1. మేధ, 2. రితిక, 3. ఆకాంక్ష.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top