‘జీవా చూడండి ఏం చేసిందో.. అచ్చం అలాగే’ | MS Dhoni Shares Daughter Jeeva Photo what She Did When Saw Ranveer Singh Pic | Sakshi
Sakshi News home page

‘జీవా చూడండి ఏం చేసిందో.. అచ్చం అలాగే’

Oct 8 2019 3:57 PM | Updated on Oct 8 2019 4:41 PM

MS Dhoni Shares Daughter Jeeva Photo what She Did When Saw Ranveer Singh Pic - Sakshi

తల్లీదండ్రులు తమ పిల్లలు హీరోలా ఫోజ్‌లు ఇచ్చిన, వారిలా డైలాగ్స్‌ చెప్పినా వారిని చూసి తెగ ఆనందపడిపోతుంటారు. అలా వారిని హీరో లుక్‌లో కనింపించేలా తయారు చేసి అచ్చం హీరోలాగే ఉన్నాడు అంటూ మురిసిపోతుంటారు. అలాగే మన భారత క్రికెట్‌ జట్టు మాజీ సారధి ఎంఎస్‌ ధోని కూడా కుతురు జీవా స్టైల్‌కు మురిసిపోతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్‌ చేసాడు. శనివారం జరిగిన  ఏల్లే బ్యూటీ ఆవార్డు ఫంక‌్షన్‌లో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ధరించిన లాంటి సన్‌గ్లాసస్‌నే జీవా కూడా పెట్టుకుంది. రణ్‌వీర్‌ లాగే ఫోజ్‌ ఇచ్చిన జీవా ఫోటోను ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘రణ్‌వీర్‌ ఫొటో చూడగానే జీవా ఏం చేసిందో చూడండి.. అచ్చం అలాంటి గ్లాసెస్‌నే పెట్టుకుని, రణ్‌వీర్‌ లాగే ఫోజ్‌ ఇచ్చింది’ అంటూ ఆ ఫొటోకు కామెంట్‌ పెట్టాడు. ఈ ఫోటోకి ఇప్పటి వరకు 22 లక్షలకు పైగా లైకులు, 15 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. అలాగే ‘చాలా ముద్దుగా ఉంది, ఈ పోస్ట్‌ చూసిన రణ్‌వీర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి’ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. కాగా జీవా ఫోటో చూసిన రణ్‌వీర్‌ సింగ్‌  ‘హహ్హహ్హ.. చాలా స్టైలీష్‌ జీవా అంటూ కామెంట్‌’ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement