టీమిండియా ఫిట్నెస్ కోచ్ రాజీనామా | Indian Cricket Team's Conditioning Coach Shankar Basu Resigns | Sakshi
Sakshi News home page

టీమిండియా ఫిట్నెస్ కోచ్ రాజీనామా

Dec 26 2016 3:55 PM | Updated on Sep 4 2017 11:39 PM

టీమిండియా ఫిట్నెస్ కోచ్ రాజీనామా

టీమిండియా ఫిట్నెస్ కోచ్ రాజీనామా

భారత క్రికెట్ జట్టు ఫిట్నెస్ కోచ్ శంకర్ బసూ తన పదవికి రాజీనామా చేశారు.

ముంబై: భారత క్రికెట్  జట్టు ఫిట్నెస్ కోచ్ శంకర్ బసూ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్టు సిరీస్ తరువాత రాజీనామా చేయడానికి సిద్ధమైన శంకర్ బసూ.. తాజాగా తన రాజీనామా పత్రాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి అందజేశారు. గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టులో  ఫిట్నెస్ కోచ్ గా చేరిన బసూ.. సుమారు ఏడాది కాలంలోనే జట్టు నుంచి బయటకు వచ్చేశారు. గత కొంతకాలంగా టీమిండియా జట్టును ఫిట్నెస్ పరంగా బాగా బలోపేతం చేసిన బసూ ఆకస్మిక రాజీనామాకు పలువురు ఆటగాళ్లే  ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహా, మొహ్మద్ షమీలు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తమ ట్రైనింగ్ చిట్కాలను మార్చాలంటూ కొంతమంది ఆటగాళ్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. తమకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రొగ్రామ్ నిర్వహించాలని వారు బసూను కోరడంతోనే అతను రాజీనామా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, బసూ రాజీనామా పునరాలోచించుకోవాలంటూ భారత టీమ్  మేనేజ్మెంట్ కోరినా, బసూ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.  గతంలో స్వాష్ ప్లేయర్స్ దీపికా పల్లికల్, జోస్నా చిన్నప్పలకు బసూ ఫిట్ నెస్ కోచ్ గా పని చేశారు.దాంతో పాటు ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా బసూ తన సేవలను అందించాడు. భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి అత్యంత ఇష్టమైన ఫిట్నెస్ కోచ్ శంకర్ బసూ.

Advertisement
 
Advertisement
Advertisement