ఆరు మ్యాచ్‌ల తర్వాత... | After six matches ... | Sakshi
Sakshi News home page

ఆరు మ్యాచ్‌ల తర్వాత...

Nov 22 2016 11:56 PM | Updated on Oct 2 2018 8:39 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆరు మ్యాచ్‌ల తర్వాత నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు ఖాతాలో మరో ....

గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆరు మ్యాచ్‌ల తర్వాత నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. పుణే సిటీ ఎఫ్‌సీ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జట్టు 1-0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 81వ నిమిషంలో కోఫీ క్రిస్టియన్ ఎండ్రీ గోల్ చేసి నార్త్ ఈస్ట్ విజయాన్ని ఖాయం చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో చెన్నైరుున్ జట్టు తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement