దుమ్ములేపే డ్యాన్స్‌.. సోషల్‌ మీడియా షేక్‌..! | Viral Video Of Group Dance | Sakshi
Sakshi News home page

వైరల్‌: దుమ్ములేపే డ్యాన్స్‌.. సోషల్‌ మీడియా షేక్‌..!

Feb 18 2020 11:12 AM | Updated on Feb 18 2020 11:32 AM

Viral Video Of Group Dance - Sakshi

ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌ ప్రభుదేవా. ప్రేమికుడు సినిమాలో ముక్కాలా.. ముక్కాబులా అంటూ ఆయన చేసిన డ్యాన్సులు ఇప్పటికీ మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఎంతో మంది యువతకు ఆయన స్పూర్తి. ఇదే కోవలో ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నలుగురు  కుర్రాళ్లు వారిలో దాగిన ప్రతిభని ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. గతంలో మనలో దాగి ఉన్న ప్రతిభని నలుగురికి చెప్పాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారడంతో టెక్నాలజీని వాడుకొని రాత్రికి రాత్రే ఓవర్‌నైట్‌ సెలబ్రెటీలుగా మారిపోతున్నారు.  చదవండి: రెస్టారెంట్‌ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!

తాజాగా ఓ నలుగురు కుర్రాళ్లు స్ట్రీట్‌ డ్యాన్స‌ర్ 3డీ చిత్రంలోని ముక్కాలా.. ముక్కాబులా అనే సాంగ్‌కి దిమ్మ‌తిరిగే స్టెప్పులు వేశారు. ముక్కాలా.. ముక్కాబులా అనే పాటకు ప్రభుదేవా వేసిన డ్యాన్స్‌ అప్పట్లో ఆడియన్స్‌ చేత విజిల్స్‌ వేయించిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం నలుగురు కుర్రాళ్లు చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుండ‌గా, బాలీవుడ్ యాక్ట‌ర్స్‌ శృతి సేత్‌, గౌర‌వ్ కపూర్ ఆ గ్యాంగ్ వేసిన స్టెప్పుల‌కి ఫిదా అయ్యారు. 3.9 ల‌క్ష‌ల‌కి పైగా నెటిజ‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోని చూడ‌గా.. 26,000 మందికి పైగా లైక్ చేయడం విశేషం.  చదవండి: పాల కోసం ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్‌ చేసింది!

Advertisement
 
Advertisement
Advertisement