377 సెక్షన్‌ ఉంటుందా, ఊడుతుందా?

what is the future of 377 section - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కులతోపాటు, స్త్రీ, పురుషుల మధ్య అసహజ సెక్స్‌ను నిషేధిస్తున్న భారతీయ శిక్షా స్మతిలోని 377వ సెక్షన్‌ను పునర్‌ పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడం, దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించడం తమ హక్కుల కోసం పోరాడుతున్న ఎల్‌జీబీటీ కమ్యూనిటీ ప్రాథమిక విజయం. భారతీయ రాజ్యాంగంలోని పౌరుల ప్రాథమిక హక్కులను సుప్రీం కోర్టు ఎలాంటి భాష్యం చెబుతుందో చూడాలనే ఆతతతో ప్రజలు ఉన్నారు. (సాక్షి ప్రత్యేకం)

దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు అమలుచేసే చట్టాలకు భారతీయ శిక్షా స్మతి అని పేరు పెట్టుకున్నప్పటికీ భారత్‌ ఇప్పటికీ బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను ఉపయోగిస్తోంది. కాకపోతే అప్పుడప్పుడు అవసరానికి తగ్గట్లు చట్టాల్లో సవరణలు చేస్తూ వస్తోంది. 1950 నుంచి ఇప్పటి వరకు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో 30 సార్లు సవరణలు తీసుచ్చొనప్పటికీ ఇందులోని 377 జోలికి పోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయకపోయినప్పటికీ అది మాత్రం అలా ఉంటూ వచ్చింది. ఈ చట్టాన్ని ఎవరు పట్టించుకోకపోవడం అందుకు కారణం కాదు.(సాక్షి ప్రత్యేకం)

ఈ సెక్షన్‌ ఎత్తివేయాల్సిందిగా 2000 సంవత్సరంలోనే లా కమిషన్‌ సిఫార్సు చేసింది. అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఎక్కడ సనాతన ధర్మాలు కలిగిన ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందన్న భయం. ఎల్‌జీబీటీ హక్కుల కార్యకర్తలు ఈ అంశంపై కోర్టుకు వెళ్లగా సెక్షన్‌లోని కొన్ని అంశాలను రాజ్యాంగ విరుద్ధమని 2009లో ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఈ తీర్పును 2013లో సుప్రీం కోర్టు కొట్టి వేసింది.(సాక్షి ప్రత్యేకం) ఈ సెక్షన్‌ కింద శిక్ష పడేది అతి కొద్ది మందికే కనుక పౌరల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగినట్లు కాదంటూ సుప్రీం కోర్టు భాష్యం చెప్పింది. ప్రైవసీ కలిగి ఉండే హక్కు గురించి చర్చ వచ్చినప్పుడు గతేడాది వివాదాస్పదమైన ఈ అంశాన్ని పునర్‌ పరిశీలించేందుకు అంగీకరించింది. ఇప్పుడు ఈ అంశం రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉంది.(సాక్షి ప్రత్యేకం)
ప్రాథమిక, ప్రైవసి హక్కుల ప్రకారం అసహజ సెక్స్‌కు శిక్షించే అధికారం చట్టానికి ఉండకూడదు. చట్టాన్ని ఎత్తివేస్తే అసహజ శృంగారాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందేమోనని ఇటు సుప్రీం కోర్టు, అటు కేంద్రం భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌జీబీటీ హక్కులను అనేక దేశాలు గుర్తిస్తూ వస్తున్నప్పుడు పౌరుల హక్కులను దెబ్బతీసే ఇలాంటి చట్టాలను ఎత్తివేయడమే మంచిది. అసహజ సెక్స్‌ను సమాజం అంగీకరించలేకపోతే సాంఘిక ఉద్యమాల ద్వారానే ప్రజల్లో మార్పు తీసుకరావాలీగానీ, చట్టాల ద్వారా ఆపాలనుకోవడం అర్థరహితమే అవుతుంది.(సాక్షి ప్రత్యేకం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top